గాడ్ ఆఫ్ మసెస్ బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. మరో రెండు రోజుల్లో గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న క్రమంలో.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగానే.. సినిమా ప్రమోషన్స్ తోను ఆడియన్స్‌ను టీం తమ వైపు తిప్పుకుంటున్నారు. అదే టైంలో అఖండ సీక్వెల్ లో ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్ కు కూడా నచ్చేసేలా మూవీని బోయపాటి పర్ఫెక్ట్గా రూపొందించాడట. స్క్రిప్ట్‌తో పాటు.. మేకింగ్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ కొట్టడమే టార్గెట్‌గా.. ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక.. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకు డిసెంబర్ 4 నుంచి ప్రీమియర్స్ పడతున్నాయి. ఈ క్రమంలోనే.. బాలయ్య ఫ్యాన్స్ అఖండ 2 కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుందంటూ.. సంచలనం సృష్టిస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా విషయంలో అందరికీ ఉన్న ఒకే ఒక్క చిన్న డౌట్ హీరోయిన్ సెలక్షన్. ఫిమేల్ లీడ్ రోల్‌ను సీక్వెల్‌కు ఛేంజ్ చేయడమే.. ప్రస్తుతం హాట్ టాపిక్. ఫస్ట్ పార్ట్‌లో ప్రగ్యాను హీరోయిన్గా తీసుకున్న టీం.. సీక్వెల్‌కు సంయుక్త మీనన్‌ను ఫిమేల్ లీడ్‌గా చూపించనున్నారు. అయితే.. ఫస్ట్ హాఫ్‌లో ఐఏఎస్ అధికారులుగా ప్రగ్య మెప్పించిందనే చెప్పాలి.

పవర్ ఫుల్ రోల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తన యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. బాలకృష్ణతో అమ్మడి కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. కానీ.. ఇప్పుడు సీక్వెల్ విషయంలో ఏం జరగబోతుందని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. హీరోయిన్ రోల్ విషయంలో టీం ఎలా జస్టిఫై చేస్తారో.. బాలయ్య సంయుక్త కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో.. అసలు స్క్రీన్ పై వీళ్ళిద్దరి ప్రజెన్స్ ఎలా ఉండబోతుంది అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. బోయపాటి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేకింగ్ అండ్ టేకింగ్ లో సరైన ప్లాన్ తో ముందుకు వెళ్లే బోయపాటి.. ఇప్పుడు కూడా సంయుక్తను స్క్రీన్ ప్రజెన్స్ చేసే విషయంలో అదే ఫాలో అవుతున్నాడట. కనుక హీరోయిన్ విషయంలో కూడా ఎలాంటి తేడా ఉండదని టీం చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


