2025 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ సందడి నెలకొంది. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఒకరి తర్వాత ఒకరు దండయాత్ర చేస్తూ వచ్చారు. అయితే.. ఒక సినిమా రిలీజ్ కి ముందు ఆడియన్స్ సినిమాపై ఏ రేంజ్ లో హైప్ నెలకొందో తెలియాలంటే బుక్ మై షో ఫ్రీ సేల్స్ నిదర్శనం అనడంలో సందేహం లేదు. ఇక.. ఇప్పటికే ఈ ఏడాది తుది దశకు చేరుకున్న క్రమంలోనే ఈ ఏడాది మొత్తం లో ఇప్పటి వరకు బుక్ మై షో టాప్ ప్రీ సెల్స్ జరుపుకున్న సినిమాల లిస్ట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఏ స్టార్ హీరో డామినేషన్ ఇయర్ రేంజ్‌లో ఉందో.. ఈరోజు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన అఖండ 2 తాండవం సినిమా ఫ్రీ సెల్స్‌లో ఎన్నో పొజిషన్‌ను దక్కించుకుందో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చివరిగా తెరకెక్కిన ఓజీ.. రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలో ఫ్రీ సేల్స్‌తోనే ఏకంగా 950 కే దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 815కే ఫ్రీ సేల్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే.. సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలను నెలకొల్పిన రిలీజ్ తర్వాత యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత హైయెస్ట్ ప్రీ సేల్స్ బుక్ చేసిన మూవీ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
దానికి తగ్గట్టుగానే ఏకంగా 503 కే ప్రీ సేల్స్‌ను సొంతం చేసుకుంది. ఇక వెంకటేశ్ – అనిల్ కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా 442 కే ప్రి సేల్స్ సొంతం చేసుకుని 4వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా తర్వాత హిట్ 3.. 336k ప్రీ సేల్స్ తో 5వ స్థానం దక్కించుకుంది. ఇక నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన అఖండ 2.. 300కే ప్రీ సేల్స్‌తో 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ 268కే ప్రీ సేల్స్ తో 7వ స్థానంలో.. తర్వాత బాలయ్య నటించిన డాకు మహారాజ్ 235 కే ప్రీ సేల్స్ తో 8వ స్థానంలో, యంగ్ హీరో తేజ సజ్జా మీరాయ్ 194 కే ప్రీ సేల్స్ తో 9వ స్థానంలో, నాగచైతన్య తండేల్ 1505కే ఫ్రీ సేల్స్ తో 10వ స్థానంలో నిలిచాయి.


