అఖండ 2: హైలెట్స్ ఇవే.. సినిమా రేంజ్ ని మార్చేశాయిగా..!

బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్‌ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాత్రి రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్‌ సినిమాపై రివ్యూ షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక కొన్ని హైలెట్స్ అయితే సినిమా రేంజ్‌ను డబల్ చేశాయి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సినిమా టాప్ హైలెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

సినిమా స్లో నరేషన్‌ అంత ప్రారంభమైన అఖండ ఎంట్రీ మాత్రం ఆడియన్స్‌లో గూస్ బంప్స్‌ తెప్పించింది సినిమాకు హైలైట్ అనడంలో సందేహం లేదు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా స్లో న‌రుష‌న్ అంటూ ఆడియన్స్ లో కాస్త నెరత్సాహం ఏర్పడింది. అయితే సెకండ్ హాఫ్ ప్రారంభం నుంచే ప్రేక్షకులకు ఊపిరాడకుండా చేశాడు బోయపాటి. మొదటి 40 నిమిషాల పాటు తెరపై యాక్షన్ విధ్వంసం నెక్స్ట్ లెవెల్ లో చూపించాడు. ఫైట్స్, చేజింగ్, భారీ సెట్టింగ్లు, పగడ్బందీ ప్లాన్‌తో ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశాడు.

ఈ క్రమంలోనే.. సినిమా యాక్షన్, ఫైట్ సీన్స్ లో బోయపాటి సక్సెస్ అయ్యాడని చెప్పాలి. బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్‌, బోయపాటి విజన్ సినిమా సెకండ్ హాఫ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా.. బాలకృష్ణ, బోయపాటి కాంబో సినిమా అంటే మాస్ ఫైట్లను ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ అంచనాలను బాలయ్య ఈ సినిమాతో కచ్చితంగా రీచ్ అయ్యాడనే చెప్పాలి. బాలయ్య మాస్ ఆడియన్స్ కు సినిమా ఫిస్టులా అనిపించింది. ఎప్పటిలాగే బాలయ్య యాక్షన్స్ స‌న్నివేశాల్లో తనదైన స్టైల్ తో అదరగొట్టాడు. ఎనర్జీటిక్‌ డైలాగ్ డెలివరీ.. థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయించింది.

సినిమాలో లాజిక్‌లు, కంటెంట్ లాంటి విషయాలను పక్కనపెట్టి.. సినిమా చూస్తే మాత్రం మాస్ ఆడియన్స్‌కు కచ్చితంగా సినిమా నచ్చుతుంది. ఇక.. ఈ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో హైలెట్ గా మారడానికి మరో కారణం థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఇవి మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రతి ఒక్క ఫైట్ సీన్‌లోను అఖండ రుద్రతాండవంను మ్యూజిక్ పవర్‌తో ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేశాడు థమన్. ఈ క్రమంలోనే సినిమా సెకండ్ హాఫ్ 40 నిమిషాల పాటు.. దియేటర్లలో మోత మోగిపోయింది. మాస్ టెస్ట్ కు థియేటర్ షేక్ అయింది. ఈ 40 నిమిషాలు సినిమా అంచ‌నాల‌ను డ‌బ‌ల్ చేసింద‌న‌డంలో సందేహం లేదు. ఇక.. క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్ సీన్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. అయితే.. సినిమాలో లాజికల్, కంటెంట్ కాకుండా.. బాలయ్య – బోయపాటి కాంబో మాస్ యాక్షన్ ఎంజాయ్ చేయాలంటే ఫ్యాన్స్ థియేట‌ర్స్‌కు వెళ్ళ‌ల్సిందే.