బాలకృష్ణ, బోయపాటి హాట్రిక్ కాంబోబో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం ఎట్టకేలకు అన్ని అవాంతరాలను దాటుకుని గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి ఆచంట సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా ప్రస్తుతం బ్రహ్మాండమైన రెస్పాన్స్‌తో థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. ప్రొడ్యూసర్ మాట్లాడుతూ బుకింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి.. ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది.. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని అనివార్య కారణాలతో సినిమా వారం రోజులు వాయిదా పడినా.. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని వివరించారు.
ఇక సినిమా వాయిదా పడినందుకు బాలయ్య బాబు, డైరెక్టర్ బోయపాటి గారు, ఫ్యాన్స్ కు మా ప్రొడక్షన్ తరఫునుంచి క్షమాపణలు చెబుతున్నాను అంటూ వెల్లడించారు. ఇక ఈ సమస్య పరిష్కారం కోసం మ్యాంగో మీడియా రామ్ గారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చాలా సపోర్ట్ గా నిలిచారని వాళ్లకు థాంక్స్.. ఒక వారం రోజులు ఆలస్యమైన డిసెంబర్ 11 సినిమా ప్రీమియర్స్ ను రిలీజ్ చేసాం. ఆడియన్స్ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. భ్రమరాంబ థియేటర్లో మేము కూడా సినిమా చూసామని.. ఫ్యాన్స్ అసలు సీట్లో కూర్చోట్లేదు.. నుంచుని చప్పట్లు, విజిల్స్ తో అద్భుతమైన రెస్పాన్స్ ను ఇస్తున్నారు. మార్నింగ్, మ్యాట్నీ ఇలా అన్ని మ్చి బుకింగ్స్ ఉన్నాయి.
దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఇలాంటి రిపోర్ట్లే వస్తున్నాయి. నార్త్‌లో జీ సినిమాస్ ద్వారా దాదాపు 800 స్క్రీన్ లలో మూవీ రిలీజ్ చేస్తే.. అక్కడ ఆడియన్స్ కూడా ఇదే రేంజ్ లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ బ్రహ్మాండంగా ఉందని.. సూపర్ స్పీడ్ తో టికెట్స్ బుక్ అవుతున్నాయంటూ వివరించాడు. ఈ క్రమంలోనే.. రెండు రాష్ట్రాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. ఇక కేవలం ప్రీమియర్స్‌తోనే నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి రూ.10 కోట్ల గ్రాస్ వరకు వచ్చిందని.. కర్ణాటకలో కోటి రూపాయలు కలెక్ట్ చేసిందని మేకర్స్ వెల్లడించారు.



