‘ అఖండ 2 ‘ బోయపాటి ఆ ఒక్క మిస్టేక్ చేయకుంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేదా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ – బోయపాటి కాంబో అంటేనే ఆడియన్స్‌లో సినిమా పై అంచనాలు ఆకాశాన్నికంట్టుతాయి. అలాంటి అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వల్‌గా సినిమా రూపొందుతుందంటే.. ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. అఖండ 2 అనౌన్స్మెంట్ అప్పటినుంచి. ఆడియన్స్లో సినిమాపై మంచి హైప్‌ మొదలైంది. ఇక‌ కొద్ది గంట‌ల‌ క్రితం సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక.. ఇప్పటికే సినిమా ప్రీమియర్ షో ముగించుకొని రివ్యూలు వైరల్ గా మారుతున్నాయి. అయితే సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్స్ చూస్తే.. ఆడియన్స్ అందరిలో బోయపాటి ఆ ఒక్క చిన్న మిస్టేక్ చేయకుండా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయేది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ బోయపాటి చేసిన మిస్టేక్ ఏంటి.. అసలు సినిమాపై ఆడియన్స్ రివ్యూ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ నుంచి అదిరిపోయే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

Balakrishna Akhanda 2 Teaser Out goosebumps signatur moment mass action Boyapati Srinu Samyuktha Aadhi Pinisetty | Akhanda 2 Teaser: త్రిశూలమా.. సుదర్శన చక్రమా? - బాలయ్య 'అఖండ' రుద్ర తాండవం.. వాట్ ఏ ...

బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో పాటు.. మాస్ యాక్షన్స్ అదరగొట్టాడ‌ని.. సినిమాకు మరో హైలెట్ థ‌మన్ మ్యూజిక్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోయపాటికి తనదైన స్టైల్ లో స్క్రీన్‌పై మాస్ తాండ‌వం చూపించాడట. మొదటి నుంచి మేకర్స్‌ చెప్పిన విధంగానే బాలయ్య రుద్రతాండవం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో మొదటి 40 నిమిషాల పాటు యాక్షన్ విధ్వంశం నెలకొందని.. ఇది ప్రతి ఒక్క ఆడియన్స్ లో గూస్బెండ్ తెప్పించిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఫైట్స్, భారీ సెట్టింగ్స్ విషయంలో బోయపాటి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడంటూ ఆడియన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Boyapati Srinu remuneration for Akhanda 2 becomes talking point | cinejosh.com

ఇక.. ఆది పిన్నిశెట్టి పిశాచ గణాల నెగిటివిటీని స్వాధీనం చేసుకొని అఘోరాలు చంపాలని చేసే ప్రయత్నాలు.. వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య కూతురుగా హర్షాలి మలహోత్రా నటన ఆకట్టుకుందట‌. అయితే సినిమా మొత్తంలో బోయపాటి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ చాలా చోట్ల లాజిక్ మిస్ అవ్వడం. కేవలం సనాతన ధర్మాన్ని ఆవిష్కరించడం, కూతురి సెంటిమెంట్, మధ‌ర్ సెంటిమెంట్,చైనా తో గొడవ, శివతత్వం, అఖండ రుద్రతాండవం ఇలా ఎన్ని మెయిన్ అంశాలను పెట్టిన థ్రెడ్స్‌ ఎక్కువై లింక్స్ తెగిపోవడంతో.. ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయారంటూ.. బోయపాటి ఈ మిస్టేక్ లేకుండా చూసుకొని ఉంటే సినిమా రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అంటూ.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా లాజిక్స్, కథ పక్కనపెట్టి మాస్ యాక్షన్‌ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ కు మాత్రం పండగే.