అఖండ 2 చేయడానికి కారణం అదే.. బోయపాటి హాట్ కామెంట్స్..!

గాడ్ ఆఫ్ మాసెస్‌ బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం నిన్న గ్రాండ్ లావెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్ల వద్ద.. బాలయ్య అభిమానుల సందడి నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇక.. సినిమా చూసిన ఆడియన్స్ సైతం పాజిటివ్ రివ్యూస్‌ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అసలు అఖండ సినిమా చేయడానికి గల కారణాలను బోయపాటి షేర్ చేసుకున్నాడు. ఆయ‌న మాట్లాడుతూ.. సినిమా చేయడానికి ప్రధాన కారణం మన వేదం, ధర్మం, దేశం, దైవం లాంటి వాటిపై ఒక అద్భుతమైన కథ నిర్మించాలనుకున్న.. ఈ సినిమా గురించి మొదట చెప్పేటప్పుడు కూడా సినిమా కాదు.. భారతదేశ ఆత్మా అని చెప్పా అంటూ వివరించాడు.

భారతదేశ నలుమూలలను చూశారు కానీ.. అసలు మూలాన్ని చూడలేదు. ఆ మూలమే మన దైవం. అది ఏంటి అని చెప్పేదే మన కథ అంటూ బోయపాటి వివరించాడు. ప్రస్తుతం బోయపాటి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ధర్మం గురించి.. వేదం గురించి ఇప్పుడు కాక మరి ఎప్పుడు చెబుతామనిపించిందని.. ఆ ఆలోచన నుంచి సినిమా పుట్టిందంటూ బోయపాటి శ్రీను వెల్లడించాడు. సినిమాకు సంబంధించి అన్ని లాజిక్లను చూసే పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాను అంటూ షేర్ చేసుకున్నాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. బాలయ్య అఖండ రుద్రతాండవం అదిరిపోయిందని.. అఘోర పాత్రలో బాలయ్య నటన, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ డెలివరీ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందంటూ చెప్పుకొచ్చారు.

ఇక విలన్ గా ఆది పినిశెట్టి.. బాలయ్యకు డామినేషన్ గా నిలిచాడట. తల్లి సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయిందని.. ఇంటర్వెల్‌ ముందు వచ్చే సీన్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేసేలా ఉన్నాయని చెప్తున్నారు. సంయుక్త, జగపతిబాబు, పూర్ణ తదితరులు సినిమాలో కీలక పాత్రలో మెరిసారు. ఇక.. సినిమా ఇప్పటికే ప్రీమియర్ షో ఫస్ట్ డే కంప్లీట్ చేసుకుంది. కేవలం ప్రీమియర్లతోనే రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఫస్ట్ డే లో రూ.40 కోట్లకు పైగానే కలెక్షన్లు అందుకున్నట్లు సమాచారం. ఇక సినిమా ఇప్పటికే ప్రీమియర్ షో, ఫస్ట్ డే కంప్లీట్ చేసుకుంది. కేవలం ప్రీమియర్లతోనే రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలియాల్సి ఉంది.