గూగుల్ 2025: ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!

ఈ ఏడాది తుది ద‌శ‌కు చేరుకుంది. మరో నెల రోజుల్లో 2025కి గుడ్పై చెప్పేసి.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఇప్పటికే ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వ‌ద్ద ఎన్నో సినిమాలు తెరకెక్కి.. వైవిద్యమైన రిజల్ట్‌తో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాలు సైతం సూపర్ హిట్‌గా నిలిచాయి. భారీ బడ్జెట్‌తో వ‌చ్చిన‌ చాలా సినిమాలు డిజాస్టర్ రిజల్ట్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది గూగుల్లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఆ లిస్టులో మొదట కాంతారా చాప్టర్ 1 పేరు వినిపిస్తుంది.

Kantara: Chapter 1 - Wikipedia

రిషబ్ శెట్టి హీరోగా.. స్వీయ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. కేవలం రీజనల్ భాషలోనే కాదు.. టాలీవుడ్‌లో ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మనాథం పట్టారు. కాంతర సినిమాకు ఫ్రీక్వల్ గా వచ్చిన సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 2025లో ఈ సినిమా కోసం నెటిజన్‌లు ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేశారు. ఈ సినిమా తర్వాత ఎక్కువగా ఆడియన్స్ ఆసక్తి చూపిన సినిమా కూలీ. సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాలతో రిలీజై.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

అయితే.. సినిమాలో నాగార్జున పవర్ఫుల్ పాత్రలో మెరిశారు. నెగిటివ్ రోల్‌లోను ఆకట్టుకున్నాడు. అలాగే.. సినిమాలో ఉపేంద్ర, అమీర్‌ఖాన్ లాంటి స్టార్ కాస్టింగ్ క్యామియో పాత్రలో మెరవడం సినిమాకు హైలెట్గా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన విషయాలను కూడా గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేశారు జ‌నం. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వ‌చ్చిన‌ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2 విషయంలో ఎక్కువ ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలోనే సినిమా గురించి సెర్చ్‌లు చేశారు. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ మూటకట్టుకుంది.

Google's top 10 most searched films of 2025 revealed

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో మరో సినిమాకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలోనూ అదే రేంజ్లో సెర్చింగ్‌లు మొదలయ్యాయి. ఇక‌ టాప్ 5లో మహావతార నరసింహ పేరు వినిపిస్తుంది. అతిత‌క్కువ‌ బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.. ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. ఈ సినిమాతో పాటే సనం తేరి కసం, సయ్యారా మార్కో, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలు గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా గూగుల్లో సెర్చింగ్ లు చేశారు.