ఇటీవల ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వరుసగా వార్తలు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలో లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ ఎన్నో షాకింగ్ కామెంట్స్ చేసి నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. లేటెస్ట్‌గా యంగ్ హీరో కిరాణ్ అబ్బవరం ఈ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశాడు. ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్ అంతకుమించి షాకింగ్ గా మారాయి. కే రాంప్ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం నటన గురించి ఓ రేంజ్‌లో ప్రశంసలు కురిపించాడు. కిరణ్ హిట్ మీద హిట్ కొడుతున్నాడు. కానీ.. ఆయనకు కూసింత గర్వం కూడా లేదు.

కొంతమంది కాలుపై కాలు వేసుకొని కూర్చుంటారు.. నెత్తిపై క్యాప్ ఉంటుంది.. ఒక్క హిట్కే అంత అవసరం లేదు. లూజ్ ప్యాంట్ వేసుకొని కొత్త చెప్పులు వేసి వాట్సాప్ అంటూ తిరుగుతారు.. కిరణ్ అబ్బవరం ఎన్ని హిట్లు కొట్టిన చాలా ఒదిగి ఉంటున్నాడు. అసలు గర్వం చూపించడం లేదు. ఆయన చూస్తే నాకు చిరంజీవి గారే గుర్తొస్తారు. చిరంజీవి గారు సైతం కెరీర్లో 150 సినిమాలు చేసిన ఎక్కడా గర్వం కనిపించదు. రేపో మాపో భారతరత్న తీసుకునేందుకు రెడీగా ఉన్నారు. కిరణ్ నీకు నేను చెప్పేది ఒకటే.

చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని గర్వం లేకుండా నీ దారిలో నువు వెళ్ళు. నీ స్టైల్ ఏంటో సినిమాల్లో చూపించు. నీ ప్రవర్తన ఎప్పటికీ ఇలాగే ఉంచుకో. మార్చుకోకంటూ బండ్ల గణేష్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇక.. బండ్ల గణేష్ ఓ స్టార్ హీరోను టార్గెట్ చేస్తూ ఈ కామెంట్స్ చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. సదరు హీరోను ఇమిటేట్ చేస్తూ.. ఆయన మాట్లాడడంతో అసలు ఆ హీరోకు బండ్ల గణేష్‌తో ఎక్కడ చెడింది అని టాపిక్.. చర్చనాయాంశంగా మారింది. మరి ఆ హీరో ఇటీవల కాలంలో సెన్సేషనల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఓ కుర్ర హీరో అని సమాచారం.

