సౌత్ సినీ ఇండస్ట్రీ మోస్ట్ ప్రస్టీజియస్.. అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో అట్లీ – బన్నీ సినిమా సైతం ఒకటి. ఇక ఈ కాంబో అఫీషియల్‌గా ప్రకటించినప్పటి నుంచి ఆడియన్స్‌లో విపరితమైన బజ్ నెలకొంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి ప్రధాన కారణం ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటనతో పాటు.. డైరెక్టర్ అట్లీ మేకింగ్ స్టైల్. మాస్, యాక్షన్ ,ఎలివేషన్, ఎమోషన్, లవ్ అన్నింటిని మేళవిస్తూ అట్లి స్క్రీన్ పై కథ ను ప్రజెంట్ చేసే తీరు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే.. అట్లీ లాంటి తోపు డైరెక్టర్ చేతిలో అల్లు అర్జున్ లాంటి హీరో ఉంటే.. ఎలాంటి సంచలనలు సృష్టిస్తాడో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఇక.. ఈ సినిమాలో బన్నీ సరసన ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు టాప్ స్టార్ హీరోయిన్స్ నటించనున్నారట. ఇక ఆ ముగ్గురు.. దీపికా పదుకొనే, మృణాల్ ఠాగూర్, జాన్వి కపూర్ అని సమాచారం. ఇప్పటికే మృణాల్ ఠాగూర్‌పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్లు కూడా కంప్లీట్ చేశారట. ఇక.. రాబోయే స్కెడ్యూల్స్లో బన్నీ, జాన్వి కపూర్ కలిసి రొమాంటిక్ లవ్ సీక్వెల్స్ ను చేయనున్నారని తెలుస్తోంది. అతి కంప్లీట్ అయిన వెంటనే దీపిక సెట్స్‌లోకి అడుగుపెట్టనుందట. ఇక మూవీ సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని.. అల్లు అర్జున్ లుక్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో బన్నీ ఓ వైవిద్యమైన గెటప్‌లో కనిపించనున్నాడని.. సినిమాకు అస్సలు హైలైట్ ఆ సీన్సే అంటూ టాక్ నడుస్తుంది.
రఫ్ అండ్ రా యాక్షన్ అవతార్‌లో బన్నీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో లో మెరవనున్నాడట. అంతేకాదు.. బన్నీ కోసం స్క్రిప్ట్ ని కూడా అట్లీ అదే రేంజ్ లో సిద్ధం చేశాడని.. ప్రతి సీన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ ట్రీట్‌లా ఉండబోతుందని సమాచారం. ఇక.. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు నాచురల్ గా రావడం కోసం అల్లు అర్జున్ నిజంగానే విలన్ చేత దెబ్బలు తిననున్నారని అంతర్గత వర్గాల టాక్ నడుస్తుంది. ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. అయితే.. మొదట్లో సినిమాపై వ్యతిరేకత ఏర్పడిన.. అట్లీ మాత్రం ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదట. ఆ సీన్.. సినిమాకు టర్నింగ్ పాయింట్కనుక రియలిస్టిక్ గా రావాలంటే అలా చేయాల్సిందే అంటూ కరాకండిగా చెప్పేసినట్లు సమాచారం. ఇక వీళ్లిద్దరి కాంబోలో రానున్న సినిమా బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.



