ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తన అందం, అభినయానికి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. తెలుగు, తమిళ, మలయాళ ఇలా భాషలతో సంబంధం లేకుండా.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఎంత మంది స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్లను అందుకుంది. సౌత్ లో చిరంజీవితో మొదలుకొని కమల్ హాసన్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సైతం స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో సైతం మెరిసింది. ఇక బిగ్ స్క్రీన్ పై అమ్మడి అందాలను ఎంజాయ్ చేయని ఆడియన్స్ ఉండారు.

ఇక.. స్టార్ హీరోయిన్గా 250 కి పైగా సినిమాల్లో నటించి ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు.. 55 ఏళ్లు వచ్చిన ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో మెరుస్తూనే ఉంది. అయితే.. ఇంత వయసొచ్చినా అమ్మడు సోలో లైఫ్‌ను లీడ్ చేస్తుంది. పెళ్లి కాకముందే ఓ బిడ్డకు తలై.. ఆలనా పాలనా చూసుకుంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పటి సీనియర్ ముద్దుగుమ్మ.. అందాల తార శోభన. అప్పట్లో ఎంతో మంది నటీమణులు, స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన ఈ అమ్మడు.. ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.

తర్వాత మెల్లగా ఇండస్ట్రీకి దూరమై క్లాసికల్ డాన్స్‌లు నేర్పిస్తూ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ కల్కి సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. 54 సంవత్సరాల వయసులోనూ సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. పెళ్లి కాకముందే ఓ చిన్నారిని దత్తత తీసుకుని.. ఆమెకు తలైంది. ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్న తర్వాత.. సినిమాలకు దూరమైన శోభన.. తనకు ఎంతో ఇష్టమైన నాట్యమును కెరీర్ గా ఎంచుకొని.. చెన్నైలో స్కూల్ పెట్టి ఎంతోమందికి భరత నాట్యం నేర్పించింది.

