నిర్మాతకు సమస్య లేకుండా.. కోట్ల లాభాలు తెచ్చి పెడుతున్న టాప్ దర్శకుల లిస్ట్ ఇదే..!

గతంలో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సినిమా రూపొందుతుందంటే.. దానికి సుప్రీం గా హీరో నిలిచేవాడు. బడ్జెట్ ఎంతైనా అందులో సగభాగం హీరో రెమ్యూనరేషన్‌ వెళ్లిపోయేది. ఎంత గొప్ప డైరెక్టర్ సినిమా అయినా.. హీరో తర్వాతే ఆయన ప్లేస్. కానీ.. ఇప్పుడు అంత ఛేంజ్ అయిపోయింది. డైరెక్టర్ ఇజ్ కింగ్‌ అనే రోజులు వచ్చేసాయి. కంటెంట్ బాగుంది.. సినిమాను తీసి సక్సెస్ కొట్టగల సత్తా ఉంటే.. సినిమా ఆఫర్లు ఇవ్వడానికి నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే.. బాక్సాఫీస్ రికార్డులను బట్టి స్టార్ హీరోల కంటే దర్శకుల మార్కెట్ వేల్యూ కూడా ఎక్కువైంది. కేవలం క్రేజ్ కాదు.. రెమ్యూనరేషన్ విషయంలోనూ ఈ వ్యత్యాసం క్లియర్ గా అర్థమవుతుంది.

राजामौली नहीं संदीप रेड्डी वांगा संग काम करना चाहते हैं स्टार्स, जानिए 2  बड़ी वजह - The Lallantop

ఈ క్ర‌మంలోనే.. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ ఎవరు మంత్లీ శాలరీస్.. రెమ్యూనరేషన్ ఇంత అని ఫిక్స్డ్ గానా తీసుకునే పరిస్థితి లేదు. వాళ్లంతా ప్రాఫిట్ షేరింగ్ అనే కార్పొరేట్ స్ట్రాటజీ వాడుతున్నారు. సినిమా బడ్జెట్ లాభాల్లో వాటాలు వాళ్లకు కూడా వచ్చేలా మాట్లాడుకుంటున్నారు. అలా రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్‌, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు ఇప్పటికే ఈ స్ట్రాటజీని అమల్లో పెట్టేశార‌ట‌. సినిమాకు జరిగిన బిజినెస్ లో 30 నుంచి 40 శాతం వాటాను ఈ దర్శకులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రైట్స్ ద్వారా వచ్చే లాభాల్లో వాటా తీసుకోవడం వల్ల సినిమా లాభాల్లోకి వస్తే వాళ్ళ ఆదాయం వందల కోట్లు వెళ్తుంది.

Trivikram, Sukumar camps in Tollywood | cinejosh.com

ఒక విధంగా నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా దీనివల్ల మంచి లాభాలు కూడా దక్కించుకోవచ్చు. ఇక.. ఈ లిస్టులో నెంబర్ 1 పొజిషన్‌లో జక్కన్న నిలిచాడు. జక్కన్న ప్రస్తుతం మహేష్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి సినిమాలు రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం జక్కన్న దాదాపు రూ.200 కోట్ల వరకు అందుకోనున్నాడ‌ని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇది డైరెక్ట్‌ రెమ్యునరేషన్ కాదు.. సినిమా ప్రాఫిట్స్ లో వాటాగా ఆయన తీసుకోబోతున్నాడట. గ్లోబల్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేసి బిజినెస్ చేయగల సత్తా రాజమౌళి లో ఉంది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ సైతం ఇది లాభదాయకంగా భావిస్తున్నారు. ఇక జక్కన్న తర్వాత స్థానంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా పేరు వినిపిస్తుంది.

Star Directors : 2023 సినిమా ఇండస్ట్రీని ఊపేసిన టాప్ 5 డైరెక్టర్స్ వీళ్ళే..  భారీ సినిమాలతో..

ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌, అట్లీ కూడా ఇదే బాటలో నడవనున్నారు. వీళ్ల సినిమాలు ప్రారంభమవుతున్నాయంటే మినిమ‌మ్ హిట్ గ్యారెంటీ అనే నమ్మకం కేవలం నిర్మాతల్లోనే కాదు.. ఆడియన్స్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే.. వాళ్లు కూడా రెమ్యూనరేషన్ కాకుండా ప్రాఫిట్ షేరింగ్ చూజ్‌ చేసుకుంటున్నారు. ఇక ఇదే లిస్టులో సుకుమార్, త్రివిక్రమ్, నాగ్ అశ్విన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కేవలం సౌత్ డైరెక్టర్లు కాదు.. బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఇదే బాటలో నడుస్తున్నారట‌. ఇదే బిజినెస్ స్ట్రాటజీని వాడుతూ.. తమ సినిమాను సక్సెస్ చేసుకొని ప్రొడ్యూసర్లతో పాటు వాళ్లు లాభాలు పొందుతున్నారు. ఇక ముందు ముందు.. ప్రతి ఒక్క దర్శకుడు రెమ్యూనరేషన్ లెక్కన కాకుండా.. ఈ ప్రాఫిట్ షేరింగ్ మోడ్ లోకి వచ్చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.