” ది రాజా సాబ్ ” ప్రభాస్ రెమ్యూనరేషన్.. మిగతా వాళ్ళకీ అందులో సగం కూడా ఇవ్వలేదా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో ది రాజాసాబ్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడి థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా.. వచ్చే ఏడది జనవరి 9న సంక్రాంతి బరిలో గ్రాండ్గా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటే.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, బ్రహ్మానందం కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ స‌ర‌స‌న‌ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

The RajaSaab - Wikipedia

మాళవిక మోహన్‌తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కూడా ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి హైప్‌ మొదలైంది. ఇక నవంబర్ 23.. అంటే మరికొద్ది సేపట్లో సినిమా ఫస్ట్ సాంగ్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు ప్రభాస్‌తో పాటు.. ఇతర నటి నటులు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం.. సినిమాలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ నటించేందుకు కోటి రూపాయల వరకు రెమ్యున‌రేషన్‌ను ఛార్జ్ చేశాడట.

Official: The RajaSaab First Single & New Trailer on the Way | StudioFlicks

అలాగే.. హీరోయిన్గా నటిస్తున్న మాళవిక రూ.1.5 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.2 కోట్లు, రిద్ది కుమార్ కోటి రూపాయలు ఛార్జ్‌ చేసినట్లు సమాచారం. ఇక టాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సినిమా కోసం రూ.80 లక్షలు చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకుంటున్నాడట. ఇక పలు బాలీవుడ్ నివేదికల ప్రకారం ప్రబాస్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్ల భారీ రెమ్యూనరేషన్‌ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక.. మారుతి డైరెక్షన్‌లో దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్‌లో ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటుందో చూడాలి.