తనూజను ఒంటరి చేసిన హౌస్ మేట్స్.. చివరకు నాన్న భరణి కూడా హ్యాండ్ ఇచ్చాడా..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9వ ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సీజన్‌లో టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్ తనుజ. ఈమె ఇతర కంటెస్టెంట్ తో పోలిస్తే టాస్కులు తక్కువగానే ఆడిన.. 100% ఎఫర్ట్స్ ఇచ్చింది. కానీ హౌస్ లో ఉన్న అందరితో పోలిస్తే.. ఈమె బలహీనంగా ఉంది. అంతేకాదు.. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోతూ.. వెక్కి వెక్కి ఏడుస్తూ.. సీరియల్ యాక్టింగ్ అనే నెగటివ్ ట్రోల్స్‌ను సైతం ఇటీవల కాలంలో ఎదుర్కొంటుంది. అయితే.. టాస్క్‌ల‌ విషయంలో.. తనకి ఎవరూ సపోర్ట్ గా నిలవడం లేదని.. ఎప్పటికప్పుడు ఆమె కామెంట్స్ చేస్తున్న హౌస్ లో మాత్రం అందరూ తనకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. కానీ.. తాజాగా తను నాన్న అని పిలుచుకునే భరణి, క్లోజ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో సహా.. సుమ‌న్‌ లాంటి వాళ్ళందరూ తనూజకు సపోర్ట్ చేయడం మానేశారు.

అసలు మ్యాటర్ ఏంటంటే.. శాశ్వత హౌస్మెట్ గా మారిన భరణిని బిగ్ బాస్.. కెప్టెన్సీ టాస్క్ కంటెండ‌ర్స్‌ను ఎంపిక చేసే ఛాన్స్ ఇచ్చాడు. అప్పుడు.. భరణి తనకు సపోర్ట్ చేసిన తనుజ, దివ్య, నిఖిల్, సాయి మరియు తనూజ‌ని కెప్టెన్సీ కంటైనర్లుగా అనౌన్స్ చేశాడు. ఇక్కడే ఆయన వర్షన్‌లో రెండు పాయింట్స్.. వీళ్లంతా నాకు సపోర్ట్ చేసిన కంటెస్టెంట్స్, అలాగే.. వీళ్ళకి ఇప్పటివరకు హౌస్ లో కెప్టెన్సీ కూడా రాలేదు.. ఇవి చాలా ఫెయిర్ పాయింట్స్‌. కానీ సాయి.. భరణికి బలంగా సపోర్ట్ ఇవ్వలేదు. కాసేపు వారిని సపోర్ట్ చేసి.. కాసేపు శ్రీజకి సపోర్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే భరణి.. రీతూ చౌదరి లేదా మాధురీలలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని అనిపించింది. దింతో సాయి దగ్గరకు వెళ్లి.. ఈ ఒక్కసారికి ఆగిపోతావా అని అడిగితే.. నాకు మొదటినుంచి ఇమ్యూనిటీ ఉందని అవకాశాలు ఇవ్వడం మానేశారు.

Bigg Boss 9 Telugu: Fans lose patience with Bharani–Tanuja's melodrama

ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇక.. భరణి కూడా ఏం చేయలేక ఓకే చెప్పేసాడు. కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మొదట ప్లేస్‌లో తనుజ, సెకండ్ ప్లేస్ లో దివ్య, థర్డ్ ప్లేస్‌లో భరణి నిలిచారు. ఇక దివ్య, తనుజ మధ్య చివరి రౌండ్ కొనసాగింది. దివ్య కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయింది. భరణి అటు దివ్య కి పూర్తిగా సపోర్ట్ చేయలేక.. ఇటు తనుజకు సపోర్ట్ ఇవ్వలేక సైలెంట్ అయిపోయాడు. ఈ క్రమంలోనే తనుజకు దివ్య నాకోసం టాస్క్ ఆడి గెలిపించింది కదా.. ఆమెకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను అమ్మ అని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ.. తనుజ నన్ను ఆడనిచ్చి ఉండుంటే నేను కూడా ఆడేదాన్ని నాన్న అంటూ చెప్పుకొచ్చింది.

Tanuja 💕 Follow➡️ @namaste_biggboss For Biggboss Season 9 Updates All  rights credits reserved to respective owners #namastebiggboss #biggboss  #biggbosstelugu #biggbosstelugu9 #biggboss9 #telugubiggboss9 #trending  #thanujaputtaswamy #florasaini ...

ఈ లోపు టాస్క్ కంప్లీట్ అయింది. ఇక్కడ తనుజకు భరణి సపోర్ట్ చేయకపోవడానికి స్ట్రాంగ్ కారణం ఉన్న‌.. కానీ ఇమ్మానియేల్, సుమన్ వాళ్లు సపోర్ట్ గా రాకపోవడానికి కారణం మాత్రం తన ఆటిట్యూడ్. మొదటినుంచి ఏమ్ము.. తనుజకు సపోర్ట్ ఇస్తూ వస్తున్నాడు. అలాంటి తనను.. నువ్వు నాకు ఎలాంటి సపోర్ట్ చేయడం లేదని చెప్పడంతో.. నీకు ఎంత చేసినా ఉపయోగం ఉండదని ఫిక్స్ అయ్యాడు. దీంతో తనుజకు.. ఇమ్ము సపోర్ట్ చేయడం మానేశాడు. అంతేకాదు.. ప్రతి చిన్న విషయానికి హౌస్ మేట్స్ పై అరుస్తూ, చిరాకు పడుతూ తనుజ ఓవర్ చేస్తుందని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇది కూడా ఆమెకు మైనస్ అయ్యింది. పవన్ కూడా తనుజకు సపోర్ట్ చేశాడు కానీ ఇష్టపూర్వకంగా మాత్రం కాదు. నిన్నటి ఎపిసోడ్ తనుజ కి సింప‌తి క‌ల్సించినా.. లోతుగా ఆలోచిస్తే మాత్రం ఆమె కోపమే ఆమె శత్రువుగా మారిందని చెప్పవచ్చు.