పెళ్లి వార్తలపై తేజ్ క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడుగా..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో సాయి దుర్గ తేజ్‌, వైష్ణవ తేజ్ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. మెగా ఫ్యామిలీలు వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్న క్రమంలో.. ప్రస్తుతం ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ మాత్రమే బ్యాచిల‌ర్స్‌గా మిగిలిపోయారు. ఇక తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. మెగా ఫ్యామిలీలో సైతం ఈ ఇద్దరి పెళ్లిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే.. పెళ్లి గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇక.. సాయి దుర్గ తేజ్ గురించి అయితే ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఆ హీరోయిన్ తో సంబంధం ఉందని.. బ్రేకప్ అయిందని.. పెళ్లి పీటలు ఎక్కనున్నారని.. ఇలా రకరకాలుగా వార్తలు వైర‌ల్‌ అవుతున్నాయి. అయితే.. వీటన్నింటికీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా ఇద్దరు బ్రదర్స్ పెళ్లి పీటలేకబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మేనల్లుళ్ల‌ పెళ్లి బాధ్యతను స్వీకరించారని.. విదేశాల్లో చదువుకున్న ఇద్దరు మంచి కుటుంబాల అమ్మాయిలను.. దగ్గరుండి చూసి మరి ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో వార్తలు అయ్యాయి. ఇద్దరమ్మాయిల కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో దాదాపు అన్ని మాటలు కంప్లీట్ అయ్యాయని.. త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్నారంటూ వార్తలు వినిపించాయి.

Sai Durga Tej Marriage: వచ్చే ఏడాది నా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సాయిదుర్గా  తేజ్‌ | sai-durga-tej-about-his-marriage

ఈ క్రమంలోనే.. మెగా ఫాన్స్ కూడా ఇదంతా నిజమేనని నమ్మి సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అయితే.. తాజాగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తేజ్.. స్వామి వారి దర్శన తర్వాత మీడియాతో మాట్లాడాడు. విలేకరి అడుగుతూ.. మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు వచ్చే ఏడాది ఉంటుందని తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఒక్క మాటతో ఆయన పెళ్లి వార్తలు కన్ఫామ్ అయిపోయ్యాయి. దీంతో మెగా మేనల్లుళ్ల‌ పెళ్లిళ్లు వచ్చే ఏడాదిలో ఒకరి తర్వాత ఒకరికి జరుగుతాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక వైష్ణవ తేజ్ పెళ్లికి సంబంధించిన ఆఫీషియ‌ల్ అన‌నౌన్స్‌మెంట్‌ మాత్రమే మిగిలింది.