బీస్ట్ మోడ్ లో సమంత లుక్ వైరల్.. నెటిజన్ కామెంట్ కు సమంత స్ట్రాంగ్ కౌంటర్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రొడ్యూసర్ సమంతా రూత్ ప్ర‌భు.. తన ఫిట్నెస్‌ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తన డిసిప్లిన్, డెడికేషన్ ఈ ఫిట్నెస్ జర్నీలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే.. ఇంటెన్స్ వర్క్ అవుట్లతో సూపర్ ఫిగర్ ను మైంటైన్ చేస్తుందని ఇమేజ్ కూడా సమంత ద‌క్కించుకుంది. శుక్రవారం (నవంబర్ 21)న ఇన్‌స్టా వేదిక‌గా ఈ అమ్మడు షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. సమంత తాను కష్టపడి సాధించిన బ్యాక్ మజిల్స్ ను చూపిస్తూ.. ఓ ఫోటోను షేర్ చేసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఎప్పటికీ ఇలా బలమైన బ్యాక్ రాదని ఫిక్స్ అయిపోయా. అది నా లైఫ్ లో లేదని.. నిజంగా అనుకున్న. వేరే వాళ్లకు మంచి బ్యాక్‌ చూసినప్పుడు అవును అది నాకు అసాధ్యం అనిపించేది.

కానీ.. నా ఆలోచన తప్పు.. అది తప్పని నిరూపించుకున్నందుకు ఇప్పుడు సంతోషంగా ఉంది. అందుకే ఇప్పుడు నేను ఈ పిక్ ని షేర్ చేస్తున్నా. ఈ స్థాయికి రావడానికి చేసిన శ్రమ చాలా కఠినమైనది.. తీవ్రమైనది. చేయాలని అనిపించని రోజుల్లో కూడా వర్కౌట్ కు వెళ్లడం, ఏది మారలేదు అనిపించిన కంటిన్యూ చేయడం.. వదిలేయడం ఈజీ అయిన వదలక్క పోవడమే నాకు ఈ రిజల్ట్ ఇచ్చింది. కండరాలను నిర్మించుకోవడం చాలా ముఖ్యం అంటూ వివరించింది. ఇది నాకు క్రమశిక్షణ, ఓర్పును నేర్పిందని వివరించింది.

India Forums | Samantha Ruth Prabhu steps into full-on action mode, proudly  flaunting the strength she fought hard to build. From self-doubt to beast...  | Instagram

ఏదైనా జీన్స్ లో లేదు అనే పదాన్ని వాడవద్దు. ఇది కేవలం సాకు మాత్రమే. పదేపదే ప్రయత్నిస్తే ఏదైనా సాధిమవుతుంది. మీరు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నా.. వదిలవ‌ద్దు. దానినే కష్టపడి కొనసాగించండి.. భవిష్యత్తులో మిమ్మల్ని మీరే మెచ్చుకుంటారు అంటూ సమంత సుదీర్ఘ కాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఆమె బీస్ట్ మోడ్ ఫోటోతో పాటు ఈ క్యాప్షన్ తెగ వైరల్ గా మారడంతో.. దీనిపై రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు జ‌నం. ఇందులో భాగంగానే ఓ వ్యక్తి మీరు ఇంత సన్నగా కనిపించేంతగా ఎక్సర్సైజ్ చేయకూడదంటూ కామెంట్ చేశాడు. దానికి సమంత ఘాటుగా రిప్లై ఇచ్చింది. అమె రియాక్ట్ అవుతూ.. నాకు మీ సలహా అవసరమైనప్పుడు అడుగుతా అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.