ప్రభాస్ తో రష్మిక రొమాన్స్.. నా బాడీని తీసుకెళ్లండంటూ అభిమాని కామెంట్స్..!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన నేషనల్ క్ర‌ష్‌గా తిరుగులేని ఇమేజ్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసింతే. ఈ క్రమంలోనే.. అమ్మడు తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా మెర‌వ‌నున్నాడు. నవంబర్ 7న‌.. గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో టీం ఇప్పుడు బిజీగా గడుపుతున్నారు. రష్మిక సైతం ప్రమోషన్స్ లో తెగ సందడి చేస్తోంది.

ఇందులో భాగంగా.. తాజాగా బిగ్ బాస్ షోలో మెరిసిన ఈ అమ్మడు.. కొద్దిగా గంటలకు క్రితం ట్విట‌ర్ వేతిక‌గా క్రేజీ చిట్ చాట్ నిర్వహిస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంది. ఇందులో భాగంగానే.. ఫ్యాన్స్‌ను తమకు నచ్చిన ప్రశ్నలు అడగాలని కోరింది. దీంతో.. ఓ నెటిజన్ క్రేజీ ప్రశ్నను సంధించాడు. వీలైతే మీరు ప్రభాస్ తో కలిసి నటిస్తారా.. అలా జరిగితే మాత్రం మీ కాంబోపై హైప్‌ దెబ్బకు థియేటర్‌లో నా శవాన్ని తీసుకెళ్లండి అంటూ క్రేజీ మెసెజ్‌ను షేర్ చేసుకున్నాడు.

దానిపై రష్మిక రియాక్ట్ అవుతూ.. ప్రభాస్ తో నటించడం నాకు కూడా ఇష్టమే. ఖచ్చితంగా ప్రభాస్ సార్‌ ఈ మెసేజ్ చూడాలని కోరుకుంటున్న. ఒకవేళ ప్రభాస్ సార్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే చాలా హ్యాపీ.. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో నటిస్తే నా కెరీర్‌లోనే అది చాలా స్పెషల్గా నిలుస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. ఇక ప్రస్తుతం రష్మిక, అభిమాని మ‌ధ్య జ‌రిగిన ఈ క్రేజి చిట్ చాట్ కాస్త నెట్టింటా వైరల్ గా మారుతుంది.