టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా హీరోయిన్గా.. పృధ్వీరాజ్ సుకుమార్ మరో కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూట్ సర్వే గంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ఇస్తామని రాజమౌళి అఫీషియల్ గా వెల్లడించాడు. రాజమౌళి ఈ ప్రమోషన్స్ ను ఊర మాస్ రేంజ్ లో ప్లాన్ చేశాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
ఇందులో భాగంగానే ఎస్ఎస్ఎంబి 29 సినిమా ఫస్ట్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 15న హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీలో.. భారీ పబ్లిక్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారట మూవీ యూనిట్. ఈ ఈవెంట్‌కు మహేష్, రాజమౌళి హాజరై సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌లో ఎస్ఎస్ఎంబి 29 అఫీషియల్ టైటిల్‌తో పాటు.. గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఈవెంట్ అన్ని సినిమా ఈవెంట్స్‌లా యూట్యూబ్‌లో కాకుండా.. జియో హాట్స్టార్ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌కు రాజమౌళి హక్కులను అమ్మేసాడట.
దీంతో మహేష్ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 15న జియో హాట్‌స్టార్‌లో చూడాల్సిందే. అలా.. జియో హాట్‌స్టార్‌లో పాన్ ఇండియా ప్రమోషన్స్ చేస్తూ.. లోకల్ లో భారీగా ఫ్యాన్స్ మధ్య ప్లాన్ చేశాడు జక్కన్న. ఏకంగా.. లక్షమంది అభిమానుల మధ్యన ఈ రామోజీ ఫిలిం సిటీ లో పబ్లిక్ ఈవెంట్ జరగనుందని సమాచారం. దాదాపు లక్ష మంది అభిమానులు వచ్చే అనుమతులు కూడా ఇవ్వనున్నారట. భారీగా పబ్లిక్ ఈవెంట్ ని ప్లాన్ చేయనున్న క్రమంలో.. సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కి ఈ రేంజ్ ప్రమోషన్స్ ఉంటే.. ముందు ముందు రాజమౌళి ఇంకే రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తాడు అనే ఆసక్తి అందరిలో మొదలైంది.



