మహేష్ కంటే ముందే తెలుగులో ఆ ఇద్దరు హీరోలతో కలిసి ప్రియాంక మూవీ.. కానీ..

ప్రపంచవ్యాప్తంగా ఆడియ‌న్స్ అందరి దృష్టి మహేష్ బాబు, రాజమౌళి కాంబో పైనే ఉంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న గ్లోబల్ ట్రోట‌ర్‌పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొద్ది గంటల్లో.. ఈ సినిమా నుంచి స్ట్రాంగ్ అప్డేట్స్ రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్స్‌1పై ఆడియన్స్‌లో అదుర్స్ రెస్పాన్స్ దక్కింది. దీంతో సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ.. ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. జక్కన్న గ్లోబల్ ట్రోటర్ ఈ నెల 15న ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే.. ఈవెంట్‌లో జక్కన్న ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని ఆసక్తి అందరిలోను మొదలైంది.

Fandango | Our first look at Priyanka Chopra Jonas as Mandakini in the new  untitled film from #RRR director, SS Rajamouli. | Instagram

ఇక.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా మెరవనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రియాంక తెలుగులో నటించిన మొదటి సినిమా గ్లోబల్ ట్రోటర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. ఈ సినిమా కంటే ముందే ప్రియాంక మరో తెలుగు సినిమాలో నటించింద‌ట‌. ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఓ సినిమాలో నటించిన.. ఆ మూవీ ఏదో.. ఆ ఇద్దరు హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. 2002లో తమిళ్ ఇండస్ట్రీలోకి ప్రియాంక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అదే టైంలో తెలుగులోను ఓ సినిమాలో న‌టించింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. అపురూపం. ఈ సినిమాలో మధుకర్, ప్రసన్న కుమార్‌ ఇద్దరు ప్రధాన పాత్రలో మెరిశారు.

PriyankaChopra's first Telugu film Apuroopam (2005) had its music released,  but the movie never hit theatres due to financial issues.

జి.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూట్.. చాలా వరకు కంప్లీట్ అయిపోయిందట. కానీ.. అనుకోని కారణాలతో సినిమా రిలీజ్‌కు ముందే ఆగిపోయింది. ఇక.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ప్రియాంకా.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే.. రామ్ చరణ్‌తో కలిసి ప్రియాంక బాలీవుడ్ లోనే జంజీర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డ‌బ్ అయ్యింది. కాగా.. ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 తో మరోసారి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని రోల్‌లో క‌నిపించ‌నుంది. ఇప్పటికే.. అమ్మడి ఫస్ట్ లుక్‌ను రాజమౌళి రివిల్ చేయగా.. ఆ పోస్టర్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.