వెండితెరపై పైరసీ కింగ్.. ఇమ్మడి రవి బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగు సినీ ప్రపంచానికే తలనొప్పిగా మారి భారీ నష్టాన్ని మిగిల్చి.. నిర్మాతలకు చెమటలు పట్టించిన ఒకే ఒక్క వ్యక్తి ఇమ్మడి రవి. ఎన్నోవేల సినిమాలు.. రిలీజ్ అయిన వెంటనే పైరసీ చేసి, ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి.. ఎన్నో భాషలు వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసి.. ఉచితంగా ఆడియన్స్‌ చూసేలా చేసాడు. ఐ బొమ్మ లాంటి వెబ్సైట్లను రూపొందించి అందులో వాటిని రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఇక.. ఎన్నో సంవత్సరాలుగా పోలీసులు అతని కోసం పోలీసులు ఎంక్వయిరీలు మొదలుపెట్టిన‌ క్రమంలో.. దమ్ముంటే పట్టుకుమంటూ పోలీసులకే సవాలు విసిరాడు.

Immadi Ravi Biopic Coming Soon: Makers Promise Untold Truths

ఇంతకాలం ఎవరికీ దొరకకుండా.. చిక్కకుండా జాగ్రత్త పడిన రవి.. ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడిపోయాడు. రవితోనే పోలీసులు ఆ సైట్‌మూయించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం అతని బయోపిక్‌ను సినిమాగా తీయబోతున్నారు అంటూ టాక్ సోషల్ మీడియాని షేక్‌ చేస్తుంది. ఇమ్మడి రవి కేవలం సినిమాల‌ను పైరసీ చేయడం కాదు.. ఫ్రీ పేరుతో పర్సనల్ డేటాని కూడా దొంగిలించినట్లు సమాచారం. అతను సాధారణ వ్య‌క్తిగా పైకి కనిపించినా.. ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యం చూసి జనాలతో పాటు, పోలీసులకు కూడా షాక్ అవుతున్నారు.

C Kalyan Defends His Wish For iBomma Ravi's encounter

ఈ క్రమంలోనే అతని లైఫ్‌ను బిగ్ స్క్రీన్‌పై తీసుకురావాలనే ప్రయత్నాలు తేజ క్రియేటివ్ బాక్స్ అనే బ్యానర్ మొదలుపెట్టింద‌ట‌. ఇమ్మ‌డి రవి బయోపిక్‌ని తీయడానికి టీం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడుగా.. దొరసాయి తేజ వ్యవహరించనున్నాడట. రవి లైఫ్‌లో జరిగిన వాస్తవ సంఘటనలను పైరసీ చేయడానికి దారితీసిన పరిస్థితులను.. అతన్ని లైఫ్లో ఎదుర్కొన్న సవాళ్లను.. ఐ బొమ్మ వెబ్సైట్ రూపొందించడానికి గల ఆలోచనలను.. సినిమాలో చూపించనునట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో రవి హీరోగా కనిపిస్తాడా.. లేదా విలన్ గానా తెలియాల్సి ఉంది.