ప్రముఖ వెబ్సైట్ ఓర్మాక్స్‌కు ప్రత్యేక పరిచాల అవసరం లేదు. ప్రతినెల ఓర్మాక్స్ ఇండియన్ వైడ్‌గా మోస్ట్ పాపులర్ స్టార్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తుంది. అలా.. అక్టోబర్ నెల కు సంబంధించిన లిస్ట్ తాజాగా రిలీజ్ అయింది. అయితే.. ప్రస్తుతం ఈ లిస్టు నెటింట వైరల్‌గా మారుతుంది. ఇక.. ఈ లిస్టులో టాప్ 1లో ఎప్పటిలానే రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయన ఇప్పటికే చాలాకాలం నుంచి నెంబర్ 1 పొజిషన్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. క్రేజ్, మార్కెట్, కెరియర్ ప్రాజెక్ట్స్, సోషల్ మీడియాలో డిస్కషన్స్ ఇలా ప్రభాస్‌కు అన్ని విధాలుగా కలిసి వచ్చేస్తుంది. ఇక రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ స్థానాన్ని దక్కించుకున్నారు. మూడవ ప్లేస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు.
ఇక బాలలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 4వ స్థానంలో నిలిచాడు. ఇక ఐదువ స్థానంలో కోలీవుడ్ హీరో అజిత్ చోటు దక్కించుకున్నాడు. 6 వ స్థానంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు దక్కింది. ఎప్పుడు టాలీవుడ్ టాప్ టెన్ హీరోలలో కచ్చితంగా ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక.. ఇదే లిస్టులో ఏడవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచాడు. ఇప్పుడు తన ప్లేసును మరింత స్ట్రాంగ్ చేసుకోబోతున్నాడు అనడంలో సందేహం లేదు. నవంబర్లో ఆయన నుంచి పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి సినిమా అప్డేట్ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆయన తెగ ట్రెండిగా మారుతున్నాడు.
ఇక నవంబర్ లిస్టులో మహేష్ ఎన్నో స్థానంలో నిలుస్తాడో చూడాలి. ఎనిమిదో స్థానంలో రామ్ చరణ్ చోటు దక్కించుకున్నాడు. 9వ స్థానంలో చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు ప్లేస్ దక్కింది. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు టాప్ టెన్ లోకి రాని పవన్ మొదటిసారి టాప్ నైన్ లో నిలవడం విశేషం. సెప్టెంబర్ చివరిలో రిలీజ్ అయిన ఓజీ ప్రభావం అక్టోబర్లో విపరీతంగా కనిపించింది. ఈ క్రమంలోనే అక్టోబర్ లిస్టులో 9వ స్థానంలో నిలిచాడు. ఇక పదో స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఇలా మన టాలీవుడ్ హీరోల క్రేజ్ ముందు బాలీవుడ్ హీరోలు బోల్తా పడ్డారు.

