కొలీవుడ్ సూపర్ స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రజనీకాంత్.. టాలీవుడ్‌లోను తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన యాటిట్యూడ్, స్టైల్‌తో కుర్రకారును కట్టుపడేస్తున్నాడు. అయితే.. రజనీకాంత్ కెరీర్‌లో ఎన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నా.. జైలర్ మూవీ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. వరుస డిజాస్టర్లు, ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రజనీకాంత్‌ను.. మళ్లీ ట్రాక్ లో పెట్టిన మూవీ జైలర్. ఇక రజిని హీరోగా పనికిరాడు.. కేవలం సినిమాల్లో కీలక పాత్రల్లో నటించుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగాల్సిందే అనే టైంలో జైలర్ వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసింది.
రికార్డులు క్రియేట్ చేసింది. ఒక్క దెబ్బతో.. సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ మొత్తం బ్లాస్ట్ అయ్యేలా చేసింది. ఈ జనరేషన్ ఆడియన్స్ సైతం రజనీకాంత్‌ను అభిమానించేలా సత్తా చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. అలాంటి సినిమాకు సీక్వల్గా జైలర్ 2 తెరకెక్కనుంది. ప్రస్తుతం షూట్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ.. వచ్చే ఏడాది రిలీజ్‌కు సిద్ధమవుతుంది. కాగా.. నెల్సన్‌కు రజినీతో ముచ్చటగా మూడోసారి పనిచేసే అవకాశం వచ్చిందట. ఇక రజినీ జైలర్ 2 తర్వాత హీరోగా కమల్‌హసన్ ప్రొడక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్నాడంటూ అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది.
కానీ.. తర్వాత ఇవే కారణాలతో సందర్.సి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ డైరెక్ట్ చేసే ఛాన్స్ నెల్సన్‌కు వచ్చిందట. అయితే.. అప్పటికే తారక్‌తో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓ సినిమాకు నెల్సన్ సైన్ చేసేసాడు. ఈ క్రమంలోనే రజినీతో సినిమా చేసే ఛాన్స్ ను సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అవకాశం త్రివిక్రమ్ కు వచ్చిందని.. త్రివిక్రమ్ వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ టాక్. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 సినిమా కంప్లీట్ అవ్వడానికి మరి కాస్త సమయం ఉంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్.. వెంకటేష్ తో సినిమాను కంప్లీట్ చేసి రజనీకాంత్ సినిమా పనుల్లో బిజీ అవుతాడని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు చూడాల్సిందే.



