టాలీవుడ్ నందమూరి నట సింహం బాలకృష్ణ ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాదు.. మాస్ యాక్షన్ సినిమాలతో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా రావడం.. బోయపాటి – బాలయ్య కాంబోలో వస్తున్న 4వ సినిమా కావడంతో ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక.. డిసెంబర్ 5న.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. కాగా.. ప్రస్తుతం బాలయ్య నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది.

గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో ఎన్బికె 111 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇక.. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వీర సింహారెడ్డి తెరకెక్కి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే.. ఎన్బికె 111 పై ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనే సందేహాలు అందరిలా మొదలయ్యాయి. ఈ మేరకు మూవీ టీం పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. చరిత్ర యుద్ధ భూమి.. దాని రాణిని స్వాగతించేందుకు సిద్ధంగా ఉంది.. సామ్రాజ్యం ఆమె ఘంబిరమైన రాకను చూస్తుంది.. అనే ట్యాగ్ లైన్ తో ఫ్యాన్స్ లో భారీ ఉత్సాహాన్ని నింపారు. సినిమాలో హీరోయిన్గా ఎవరు అనే విషయాన్ని నేడు మధ్యాహ్నం 12 గంటలకు రివిల్ చేస్తామంటూ టైంను కూడా అనౌన్స్ చేశారు.
In view of the heartbreaking incident near Chevella, the announcement planned for today at 12:01 PM is being held back.
Team #NBK111 extends its deepest sympathies and prayers to the families affected 🙏🏻
— Vriddhi Cinemas (@vriddhicinemas) November 3, 2025
అయితే.. కొద్దిసేపటి క్రితం చేవెళ్ల దగ్గర జరిగిన భారీ బస్సు ప్రమాదంలో 24 మంది కన్నుమూసిన నేపథ్యంలో.. మూవీ టీం ఆ సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ.. పోస్టర్ రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ.. బాధిత కుటుంబాలకు మూవీ టీం సానుభూతి తెలియజేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సినిమాలో బాలయ్య ఓ హిస్టారికల్.. పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడట. ఇకపోతే సినిమాలో రాణిగా నయనతార నటించనుందని టాక్. ఈ సినిమా భారీ ముద్ధ సన్నివేశాలు, మాస్ ఎమోషన్స్ తో కూడిన పవర్ఫుల్ స్టోరీ గా రూపొందినందట. ఇక ఈ సినిమాతో బాలయ్య తన నట విశ్వరూపాన్ని మరోసారి చూపిస్తాడు అంటే ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

