అఖండ 2 తాండవం బాలయ్య రోల్ పై మైండ్ బ్లోయింగ్ అప్డేట్..!

టాలీవుడ్ నంద‌మూరి బాలకృష్ణ ఇటీవ‌ల‌ వరుస సక్సెస్లతో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇక బాలయ్య బోయపాటి కాంపౌండ్ నుంచి వస్తున్న నాలుగో సినిమా కావ‌డం.. అఖండ‌ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వల్ గా ఈ సినిమా తెర‌కెక్కుతుండడంతో.. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమా షూట్ సైతం తుది దశకు చేరుకుందని సమాచారం.

ఈ క్రమంలోనే.. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుంది. ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఇక.. సినిమాను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో.. బాలకృష్ణ పాత్రకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం నెటింట‌ వైరల్‌గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య రెగ్యులర్ పాత్ర కనిపించనుందని.. అది కూడా చాలా ఎమోషనల్ గా తెర‌కెక్క‌నుందని సమాచారం.

ముఖ్యంగా.. ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్స్‌తో పాటు.. యాక్షన్ ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బోయపాటి చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నాడట. ఇక.. ఈ సినిమాకు బాలయ్య ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సులు బ్లాస్ట్ అయ్యే రేంజ్‌లో మ్యూజిక్ డిజైన్ చేస్తున్నాడట థమన్. ఇప్పటికే.. బాలయ్య ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ థ‌మన్‌ అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ హ్యాట్రిక్ కాంబోలో అఖండ 2 తాండవం.. హిట్ కొట్ట‌డం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.