స్టార్ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఎ, బి లాంటి సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి.. తెలుగు ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తర్వాత నిఖిల్ నటించిన అప్పుడో ఎప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమా తర్వాత కాంతారావు చాప్టర్ 1 సినిమాతో.. అమ్మడు క్రేజ్ మరింతగా పెరిగింది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాతో పాటు.. యష్ హీరోగా చేసిన టాక్సిక్‌లోను నటిస్తూ బిజీబిజీగా గడుపుతుంది.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే.. స్టార్‌డంను సంపాదించుకునే దూసుకుపోతుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. కుర్రకారును ఆకట్టుకుంటుంది. అయితే.. తాజాగా సోషల్ మీడియా వేదికగా రుక్మిణి వసంత్ షేర్ చేసిన ఓ ట్విట్ మాత్రం ప్రస్తుతం తెగ సంచలనంగా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎంతో మంది ఇతరుల పేర్లను ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలు చేస్తూ ఉంటారు. అలాగే.. ఇప్పుడు రుక్మిణి పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయని.. ఈ విషయాలన్నీ తన వరకు వచ్చాయంటూ ఆమె షేర్ చేసుకుంది. ఇలాంటి వాటిపై అభిమానులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. 944589373 నెంబర్ను షేర్ చేస్తూ.. ఓ వ్యక్తి ఈ నెంబర్ను వాడుకొని అచ్చం నాలానే మాట్లాడుతూ.. ఇతరులను సంప్రదిస్తూ మోసం చేసి డబ్బు తీసుకుంటున్నాడని.. తన దృష్టికి వచ్చినట్లు వివరించింది.

ఈ నెంబర్ నాది కాదు.. నేను అందరికీ క్లారిటీ ఇస్తున్న. ఈ నెంబర్ నుంచి ఎవరైనా ఫోన్ లేదా మెసేజ్ చేస్తే.. అసలు రియాక్ట్ కాకుండా ఈ నెంబర్ ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని ఆమె వివరించింది. నేను సైబర్ క్రైమ్‌ను కూడా ఆశ్రయించానని.. ఈ నెంబర్ నుంచి ఎవరైనా ఫోన్ చేసినా మెసేజ్ చేసిన.. మీరు వెంటనే నన్ను లేదా నా టీం అప్రోచ్ కావాలని కోరుతున్న అంటూ వివరించింది. ఇలాంటి మోసాలకు ఎవరు గురికాకుండా ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్‌లో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ అమ్మడు ఇచ్చిన ఈ వార్నింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో.. నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

