ఇమ్మడి రవి అరెస్ట్‌తో తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్న సంగతి తెలిసింది. అయితే.. పోలీసులు మాత్రం ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే అని.. రవి కేవలం ఒక్క ఫేస్ మాత్రమే.. దాని వెనుక ఉన్న నెట్వర్క్ చాలా పెద్దదంటూ చెప్పుకుంటున్నారు. ఒక రవిని జైల్లో పెడితే ఈ పైరసీ భూతం ఆగిపోదని.. టెక్నాలజీని వాడుకుని.. సినిమాలను దొంగిలించే డిజిటల్ దొంగలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారంటూ వివరించారు. తమిళనాడు నుంచి బీహార్ వరకు విస్తరించిన ఈ నెట్వర్క్ లింక్‌లు చూసి.. పోలీసుల ఆశ్చర్యపోతున్నారట.

పోలీసులు విచారణలో బయటపడినా పేర్లు, వారి పద్ధతులు చేస్తే ఎవరైనా షాక్ అవ్వక తప్పని పరిస్థితి. హైదరాబాద్‌కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మల్టీప్లెక్స్ లో పాప్‌కార్న్ ప్యాకెట్ లో ఫోన్ పెట్టి సినిమాలన్నీ రికార్డ్ చేస్తూ వచ్చేవాడు. తమిళనాడుకు చెందిన రాజు అమృతంగ్ నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి మరి పైరసీ చేపించాడు. కారణం ఓటిటి ప్రోగ్రాం, ప్రొడక్షన్ హౌస్ సర్వర్లలో ఉండే లోపాలు. వీరికి ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్ ఈ లోపాలే అని పోలీసులు చెబుతున్నారు. ఇక.. ఈ పైరసీ భూతం వెనుక కేవలం సినిమాల పిచ్చి మాత్రమే కాదు.. అంతకుమించి బెట్టింగ్ మాఫియా కూడా నడుస్తుందట.

ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళ కేవలం మధ్యవర్తులు మాత్రమే.. ప్రధాన సూత్రధారులు చైనా, మలేషియా, కాంబోడియా లాంటి దేశాల్లో ఉన్న గేమింగ్, బెట్టింగ్ యాప్ నిర్వహకులని.. ఉచితంగా సినిమాలు, పర్సనల్ డేటాలను సైబర్ నేరగాళ్లకు అమ్మేస్తున్నారు. మనం ఫ్రీగా సినిమా చూసి ఎంజాయ్ చేసాం అనుకుంటున్నాం. కానీ.. మన డేటా, ప్రైవసీని వాళ్లకు ఉచితంగా ఇచ్చేస్తున్నామనే విషయం తెలియడం లేదు.. ఇక ఈ చీకటి సామ్రాజ్యానికి టెలిగ్రామ్ లాంటి యాప్‌లు కేరాఫ్ అడ్రస్‌లుగా నిలిచాయి. ఏటా.. దాదాపు రూ.20వేల కోట్లు నష్టం దేశానికి జరుగుతుందని.. దీనిబట్టి ఈ నెట్‌వర్క్‌లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చంటూ వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐ బొమ్మ రవి అరెస్టు అనేది కేవలం వార్నింగ్.. టెక్నాలజీ మారుతున్న కొద్ది దొంగలు కూడా మరింత అప్డేట్ అవుతూ వస్తున్నారు. కేవలం ఒకరిని అరెస్ట్ చేస్తే ఇదే మారిపోదు. డిజిటల్ సెక్యూరిటీని పెంచడం, విదేశీ బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం విధించడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే.. ఐ బొమ్మ పోయిన ఇలాంటి ఎన్నో వందల వెబ్సైట్లు పుట్టుకొస్తాయి.

