టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల.. రెండు రోజుల క్రితం.. ఐఐటి హైదరాబాద్ ఈవెంట్లో సందడి చేసింది. ఈ ఈవెంట్లో ఉపాసన ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెన్ను దుమారానికి దారితీసాయి. మహిళా సాధికారత, ఆర్థిక స్వేచ్ఛ గురించి ఆమె మాట్లాడుతూ.. స్టూడెంట్స్‌కు కొన్ని సలహాలు ఇచ్చింది. మహిళలకు అతిపెద్ద ఇన్సూరెన్స్ ఎగ్స్ అని.. వాటిని భద్రపరచుకోవడం మీకు మంచిది అంటూ చెప్పుకొచ్చింది. మీరు ఆర్థికంగా స్థిరపడి.. మీ సొంత నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకున్న.. పిల్లలను కన్నా.. ఎగ్స్ ఫ్రీజింగ్ మీకు ఆ స్వేచ్ఛను ఇస్తుందంటూ చెప్పుకొచ్చింది.
నేను నా కాళ్ళపై నిలబడి.. జీవితంలో స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను.. 30 ఏళ్లలోపు మీ లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోండి. సంపదను సృష్టించండి అంటూ ఉపాసన కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే.. ఉపాసన ఉద్దేశం మంచిదైన ఇలాంటి సలహాలు అందరికీ వర్తించవు.. కొన్ని సంపన్న ఫ్యామిలీలకు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. ఇలాంటి సజెషన్స్ ఇచ్చి తప్పు చేయొద్దంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఉపాసన కామెంట్స్ పై తాజాగా మాట్రిమోనియల్ సైట్ జోడి 365 సీఈవో అనిల్ కుమార్ ఎక్స్ వైదిక రియాక్ట్ అయ్యాడు. ఇలాంటి సలహాలు విని పెళ్లి వాయిదా వేసుకున్న 30 ఏళ్లు పైబడిన చాలామంది మహిళలు ఇప్పుడు పెళ్లి విషయంలో ఆందోళన చెందుతున్నారని వివరించాడు.
Married 23.
Completed residency 27.
First child 28.
Fellowship of All India Collegium of Ophthalmology (Glaucoma) 29.
Second child 30.
Fellowship of International Council of Ophthalmology 33.
Royal College of Surgeons 36.Marriage doesn’t impede your career. #MedTwitter https://t.co/kRHgy4b9y4
— Dr Gunjan Deshpande MRCSEd, FICO (UK), FAICO, DNB (@drgunjand) November 19, 2025
ఇక ఓ ప్రముఖ గైనకాలజిస్ట్ రాకేష్ ఫారిక్.. ఎక్స్ వేదికగా ఉపాసన కమెంట్స్‌పై ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. బ్యాంక్ అఖౌంట్లో కోట్లు ఉన్నప్పుడు ఇది ఈజీ. కానీ.. ఇది సాధారణ మహిళలకు చాలా కష్టతరమైన.. బాధాకరమైన ఇంజక్షన్.. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమతో కూడిన ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చాడు. కొందరు నెటిజన్లు.. దీన్ని మేజర్ పిఆర్ ఫెయిల్యూర్ గా అభివర్నించారు. ఇక.. మరికొందరు మాత్రం దీన్ని ఐవీఎఫ్ సెంటర్లలో మార్కెటింగ్ స్ట్రాటజీ అని కొట్టి పడేస్తున్నారు. ఇక.. ఉపాసన మాటల్లో కెరీర్‌పై ఫోకస్ ఉన్నా.. అది ఆచరణలో సామాన్య మధ్య తరగతి మహిళలకు సులభం కాదని.. వేలలో, లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని.. ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యమే కానీ.. బయలాజికల్ క్లాక్ కూడా అంతే ముఖ్యమంటూ పలువురు నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
I advise young entrepreneurs I meet, both men and women, to marry and have kids in their 20s and not keep postponing it.
I tell them they have to do their demographic duty to society and their own ancestors. I know these notions may sound quaint or old-fashioned but I am sure… https://t.co/5GaEzkMcbQ
— Sridhar Vembu (@svembu) November 19, 2025
ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో జరిగిన సంభాషణ వీడియోను ఉపాసన స్వయంగా తన ఎక్స్ వేదికగా షేర్ చేసుకుంది. అందులో ఎవరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని ఉపాసన అడగగా.. అమ్మాయిలకన్నా.. అబ్బాయిలే ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు. దీన్ని బట్టి మహిళలు ముందు నుంచి కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే.. ఇది కొత్త ప్రోగ్రెసివ్ ఇండియా అంటూ ఉపాసన ఎక్స్ వేదికగా వెల్లడించింది. అయితే ఉపాసన పోస్ట్ పై ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం జోహు కంపెనీ సీఈవో శ్రీధర్ రియాక్ట్ అయ్యారు. యువత 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని సలహా ఇచ్చారు. సమాజం, పూర్వీకుల కోసం అయినా ఈ డ్యూటీని వాళ్లు నిర్వర్తించాలంటూ ఆయన సూచించాడు. ఇవన్నీ పాతకాలం మాటల్లా అనిపించినా.. కాలక్రమంలో జరగాల్సింది ఇదేనని.. తాను భావిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఉపాసన పోస్టుపై రియాక్ట్ అయ్యాడు. శ్రీధర్ వంబు. ఇక శ్రీధర్ పెళ్లి సలహాలపై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


