ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా ఎంట్రీ.. చేసిన 8 సినిమాలు సూపర్ హిట్స్.. నేషనల్ అవార్డ్ కూడా..

ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీలుగా మార‌డం అనుకున్నంత సులభం కాదు. ఇక సినిమాలంటేనే.. సక్సెస్ లు, ఫ్లాప్ లు కామన్. హీరో అయినా డైరెక్టర్ అయినా.. ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో హీట్లతో పాటు అక్కడక్కడ ఫ్లాప్‌లు కూడా చూడాల్సి ఉంటుంది. అయితే.. టాలీవుడ్‌లో మాత్రం ఇప్పటివరకు సక్సెస్ తప్ప ఫ్లాప్ ఎరుగని డైరెక్టర్గా రాజమౌళి తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ అయితే.. కొన్ని బ్లాక్ బ‌స్టర్లు గా నిలిచాయి. మరికొన్ని ఇండస్ట్రియల్ హిట్స్ అయ్యాయి.

అయితే.. ది గ్రేట్ రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న మరో వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో ఇప్పటికీ గుర్తుపట్టేసి ఉంటారు. ఎస్ అతనే టాలీవుడ్ టాలెంటెడ్.. డేరింగ్ డియాషింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎనిమిది సినిమాలు తెర‌కెక్కించి.. అన్ని సినిమాలతోను సూపర్ సక్సెస్ అందుకున్నాడు. కొన్ని సినిమాలయితే ఇండస్ట్రియల్ హిట్లుగా కూడా నిలిచాయి. 100% సక్సెస్ రేట్ ఉన్న క్రమంలోనే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆదివారం.. నవంబర్ 23 అంటే నేడు అనిల్ రావిపూడి పుట్టినరోజు.. ఈ క్రమంలో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్స్, ఫ్యాన్స్ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాదు ఆయన బ్యాక్ గ్రౌండ్‌ మరోసారి వైర‌ల్‌గా మారుతుంది. మహేష్, రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్‌, వ‌రుణ్ త‌త‌త‌తేజ్‌, సాయి ధరం తేజ్, కళ్యాణ్ రామ్ లాంటి ఎంతోమంది టాలీవుడ్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్‌లు అందుకున్న అనిల్.. గతంలో ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ తన తండ్రి గురించి ఎమోషనల్ అయ్యాడు. మా నాన్న ఓ ఆర్టీసీ డ్రైవర్.. నెలకు రూ.4 వేల జీతం.. నాకు ఎంసెట్లో 8వేల‌ ర్యాంకు వచ్చింది. ఓ మంచి కాలేజీలో పేమెంట్ సీట్ తీసుకుని.. చాలా కష్టపడి చదివించారు. ఇందుకోసం ఏడాదికి రూ.45 వేలకు పైగా కట్టాలి.

నెలకు రూ.4000 జీతం వచ్చే ఆయన నెలవారి ఖర్చులు, ఇతర అవసరాలకే ఏది ఏమాత్రం సరిపోకపోయినా.. నా చదువు కోసం లోన్‌లు తీసుకొని మరీ.. వాటిని తీర్చడానికి ఎన్నో కష్టాలు పడ్డాడంటూ వివరించాడు. ఇక ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి కారణం మనల్ని చదివించడానికి.. మనల్ని పైకి తీసుకురావడానికి పేరెంట్స్ క‌ష్ట‌ప‌డ‌తాను. వాళ్ల గురించి వాళ్ళ కష్టం గురించి తెలుసుకుంటే.. మన లైఫ్ లో ఎప్పుడూ తప్పు చేయమంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనిల్ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. నీ తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు లైఫ్ లో సక్సెస్ అందుకున్నారంటూ.. ఫ్యూచర్లో మరిన్ని సక్సెస్ లు కొడతారంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.