ఐ బొమ్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ వచ్చేసిందోచ్..!

గ‌త 3 రోజులుగా ఐ బొమ్మ ఇమ్మడి రవి ఇష్యూ సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను పైరసీ చేసే ఈ వెబ్సైట్ నిర్వాహ‌కుడు ఇమ్మడి రవి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఐ బొమ్మ సైట్‌లో దమ్ముంటే పట్టుకోమంటూ గతంలో సవాల్ చేసిన రవి.. పోలీసులకు చిక్కడంతో.. ఆత‌ని చేతిమీదే ఐ బొమ్మను క్లోజ్ చేయించారు పోలీసులు. అయితే.. ఇప్పుడు వెబ్సైట్ విషయంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐ బొమ్మ పేరుతో మరో రెసిపీ సినిమాల వెబ్సైట్ మొదలైంది.

ఐ బొమ్మ వన్ పేరుతో దీనిని మొదలుపెట్టారు. అయితే.. పేరు కాస్త వేరుగా ఉన్నా.. వెబ్సైట్ మాత్రం అచ్చుగుద్దినట్లు ఒరిజినల్ ఐబొమ్మ లానే కనిపిస్తూ అందరికి షాక్‌ను కలిగిస్తుంది. అంతేకాదు.. ఐ బొమ్మ లో కేవ‌లం తెలుగు సినిమాలే ఉంటే.. కొత్తగా ప్రారంభించిన ఐ బొమ్మ 1లో మాత్రం తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలన్నింటినీ పెట్టేశారు. అయితే దీనిని ఇమ్మడి రవి అనుచరులు ఎవరైనా మొదలు పెట్టారా.. లేదా మరి ఎవరైనా కొత్త వాళ్లే ఈ సైట్ పాపులారిటీని వాడుకొని తమ సైట్లో రన్ చేయాలని చూస్తున్నారా..తెలియాల్సి ఉంది.

Ibomma One టాలీవుడ్ ను వదలని బొమ్మాళీ భూతం.. పోలీసులను కలవరపెడుతోన్న మరో  పైరసీ సైట్ | Ibomma One New Piracy Site Troubles Tollywood After Ibomma  Ravi Arrest | Asianet News Telugu

మరోవైపు.. ఇప్పటికే ఇలాంటి వెబ్సైట్లో సినిమాలు చూడొద్దని పోలీసులు హెచ్చరిస్తూ వస్తున్నారు. పైరసీ సైట్లలో సినిమాలు చూడడం వల్ల.. చూసేవాళ్ళ పర్సనల్ డేటా అంతా దోపిడీ జరుగుతుందని.. దీంతో వాళ్లకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా.. పైరసీ సినిమాలు చూడడం జనాలకు అలవాటైపోయింది. ఈ క్రమంలోనే.. ఐ బొమ్మ‌ అభిమానులు అంతా.. ఐ బొమ్మ వెబ్సైట్ ఓపెన్ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ సైట్ వెనుక ఉన్నది ఎవరు..? ఈ పైరసీ సైట్ అంతూ కూడా పోలీసులు చేస్తారా.. లేదా.. చూడాలి.