సినీ ఇండస్ట్రీలో దృశ్యం సిరీస్‌కు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో.. ఏ రేంజ్ సక్సస్‌లు దక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థ్రిల్లర్ సిరీస్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి.. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా సౌత్ లోనే కాదు.. రీమేక్ అయ్యి నార్త్ లోను మంచి పాపులారిటి దక్కించుకుంది. దృశ్యం నార్ట్ 1,2 సినిమాలతో సక్సెస్ సాధించిన క్రమంలో.. పార్ట్ 3 పై కూడా ఫోకస్ చేశాడు జీతూ జోసఫ్. అయితే.. దృశ్యం మలయాళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోని ఒకేసారి సెట్స్‌పైకి తీసుకొచ్చి.. ఒకే సమయంలో రిలీజ్ చేయాలని భావించాడు. అయితే ఈ 3వ పార్ట్‌ను మలయాళంలో మోహన్ లాల్‌తో.. తెలుగులో వెంకటేష్‌తో.. హిందీలో అజయ్ దేవగణ్‌తో తీయాలని ప్లాన్ చేస్తున్న జోసఫ్‌కు బిగ్ షాక్ తగిలింది.
ఒకవేళ.. డైరెక్షన్ అతనికి కుదరకపోయినా.. ఇతర డైరెక్టర్‌లతో సినిమా తీయించేలా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. కారణం ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ చేసి ఆ రిజల్ట్‌తో మంచి సక్సెస్ అందుకోవాలని భావించాడు. కానీ.. వెంకటేష్ ఆ ప్లాను చెడగొట్టాడంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్.. త్రివిక్రమ్ సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఈ సినిమాతో పాటే మన శంకర్ వరప్రసాద్ గారు ప్రాజెక్టు కూడా ఆయన చేతిలో ఉంది. ఈ క్రమంలోనే రెండు సినిమాలు కంప్లీట్ అయ్యేవరకు దృశ్యం 3 సినిమాలో చేయడం కుదరదని చెప్పేసాడట. దృశ్యం 3 చేసే ఇంట్రెస్ట్ మాత్రం తనకు ఉందని వెల్లడించినట్లు తెలుస్తుంది.

ఇక జీసఫ్ తను అనుకున్న టైం లో.. దృశ్యం 3ను తెలుగులో కంప్లీట్ చేసే అవకాశాలు లేవని చెప్పాలి. అలా.. స్టార్ డైరెక్టర్ జోసఫ్ ప్లానింగ్ వెంకటేష్ చెక్ పెట్టాడని.. మలయాళ వర్షన్ మాత్రమే ఇప్పుడు షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక కాస్త లేట్ అయిన కూడా వెంకటేష్ దృశ్యం 3 కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరొకక బాలీవుడ్ దృశ్యం 3ని అజయ్ దేవగణ్.. తన సొంత కథ ఒకటి రాయించుకొని.. దాంతో తీయాలని భావించాడట. కానీ.. దృశ్యం ఫ్రాంఛైజీస్ జోసఫ్ తన కథలతోనే చేయాలంటూ పెట్టిన కండిషన్ తో ఆయన సైలెంట్ అవ్వక తప్పలేదు. ఏదేమైనా దృశ్యం 3 తెలుగు వర్షన్ రిలీజ్ లేట్ అవ్వడానికి మాత్రమే వెంకటేషే కారణం అని బజ్.. ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది.


