టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ.. మాస్ జాతర కొద్దిసేపటి క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శ్రీ లీల హీరోయిన్‌గా మెరిసిన ఈ సినిమాకు.. భాను భోగవరపు దర్శకుడుగా వ్యవహరించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో.. లక్ష్మణ్ భేరి అనే పవర్ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్గా రవితేజ మెరసాడు. తన స్టైల్, స్వాగ్, ఎనర్జీ, యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. తనదైన కామెడీ టైమింగ్ తోనూ రవితేజ ప్రేక్షకులను నవ్వించారు.

ఈ క్రమంలోనే రవితేజ.. వన్ మ్యాన్‌షో చూపించాడు అంటూ అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. కానీ స్టోరీలో డెప్త్ కనిపించలేదని.. రొటీన్ రోట్ట స్టోరీ అంటూ పలువురు.. తమ అభిప్రాయాలను వ్యక్తిని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి మిక్స్డ్ టాక్ దక్కుతుంది. కాగా.. ఈ మాస్ జాతరకు.. మొదట రవితేజకు బదులుగా మరో స్టార్ హీరోను అనుకున్నారంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఆ హీరో మరెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని. వాస్తవానికి మొదట ఈ కథ నానికి వినిపించారట.
అయితే.. నాని కథను విని రిజెక్ట్ చేశాడు. తర్వాత మరో ఇద్దరు యంగ్ హీరోలు కథను విని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. చివరకు స్టోరీ రవితేజ వద్దకు వెళ్ళింది. అంతేకాదు.. రవితేజ కెరీర్ మైల్ స్టోన్‌గా.. ఆయన 75వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ కి ముందు ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పినా.. రిలీజ్ తర్వాత మాత్రం ఊహించిన రేంజ్‌లో రిజల్ట్ అందుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే.. హీరో నాని దగ్గరకు వెళ్లినా.. స్టోరీ రిజెక్ట్ చేసి మంచి పని చేశాడంటూ.. ఫ్లాప్ స్టోరీ నుంచి తప్పించుకున్నాడంటూ.. ఎంతైనా నాని లక్కీ ఫెలో అంటూ.. రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


