హనుమాన్ ప్రొడ్యూసర్ తో వివాదం.. 200 కోట్ల నష్టపరిహారం.. ప్రతీకారం కోసమే అంటూ ప్రశాంత్ వర్మ క్లారిటీ..!

2024లో వ‌చ్చి బ్లాక్ బస్టర్గా నిలిచిన హనుమాన్ రూ.295 కోట్ల వసూలు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో దర్శక, నిర్మాతల మధ్య ఆర్థిక లావాదేవీల పరంగా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే.. ప్రశాంత్ వ‌ర్మా.. అధిరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస సినిమాలను తన సొంత బ్యానర్ పై చేస్తానంటూ హామీ ఇచ్చాడని ఫిలిం ఛాంబర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వెల్లడించాడు. ఇక వీటికోసం రూ.10.34 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడని.. మరోపక్క ప్రశాంత్ సూచనలతోనే అక్టోపస్ ప్రాజెక్టు కోసం రూ.10.23 కోట్లు ఖర్చు చేశానని.. అవసరమైన ఎన్ఓసి మాత్రం నాకు అప్పగించలేదంటూ వెల్ల‌డించాడు.

K Niranjan Reddy : 'హనుమాన్' 100 రోజుల వేడుకలు.. ఫస్ట్ సినిమా అయినా బడ్జెట్  విషయంలో ధైర్యంగా నిలబడ్డ నిర్మాత..

దీంతో మొత్తం రూ.20.57 కోట్ల రిఫండ్.. అలాగే రూ.200 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశాడు. ఈ వాదానికి ఎండ్ కార్డు పడే వరకు తాను చేస్తున్న ఈ ప్రాజెక్టులన్నింటినీ ఆపేయాలని ఫిర్యాదు లో వెల్లడించాడు. ఈ వాదంతో సోషల్ మీడియాలో భారీ కలకలం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా వివాదం పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రియాక్ట్ అయ్యాడు. ఈ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు అసలు ప్రూఫ్స్ ఏ లేవని.. అన్ని అబద్ధాలు అని.. ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసిన చర్యలని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే మీడియాలో వస్తున్న వార్తలపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశాడు.

కొన్ని మీడియా పోర్టల్స్‌, సోషల్ మీడియా పేజీలు, న్యూస్ ఛానల్‌లు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దాకలు చేసిన ఫిర్యాదు వివరాలను., అలాగే నా సమాధానం లోని కొన్ని భాగాలను మాత్రమే రిలీజ్ చేసి ప్రచారం చేయడం నా దృష్టికి వచ్చిందంటూ వివరించాడు. ఈ పక్షపాత, బాధ్యత రహిత ఏకపక్ష సమాచారం ప్రసారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని.. ప్రశాంత్ వర్మ ప్రెస్ నోట్ లో వెల్లడించాడు. నాకు, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ముందు విచారణలో.. న్యాయ పరిశీలనలో ఉంది.

ఈ క్రమంలో అన్ని పక్షాలు తీర్పు కోసం ఎదురుచూడడం మాత్రమే సరైన విధానం.. మీడియా ద్వారా వివాదాన్ని తీర్చాలని ప్రయత్నించడం సరైనది కాదంటూ ప్రశాంత్ వర్మ రాసుకొచ్చాడు. అసలు ఈ విచారణలో జోక్యం చేసుకోవద్దు అంటూ మీడియాను కోరుకున్నాడు. నా మీద చేసిన అన్ని ఆరోపణలు అసత్యమని, నిరాధారమైనవి.. కేవలం రివేంజ్ తీర్చుకోవడం కోసమేనని స్పష్టంగా వెల్లడించాడు. అన్ని మీడియా సంస్థలు డిజిటల్ ప్లాట్ ఫామ్‌ల‌లో.. సోషల్ మీడియా ఛానళ్లు, న్యూస్ ఛానళ్లు ఆధార రహిత ప్రచారాలు చేయడం మానుకోవాలంటూ కోరుతున్నా అని.. ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పోస్ట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.