గత రెండు రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉందంటే ఐ బొమ్మ ఇమ్మడి రవి ఇష్యూ. టాలీవుడ్ నిర్మాతలకు చుక్కలు చూపించి.. వేల కోట్లు నష్టం వచ్చేలా చేసిన ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది నిర్మాతలు రిలీఫ్ అయ్యారు. సిపి సజ్జనర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఐ బొమ్మ రవి ఆకృత్యాలను రివిల్ చేస్తూ.. ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఇక ఈ ప్రెస్ మీట్‌లోనే.. సినీ ప్రముఖులు పలువురు మాట్లాడుతూ.. పోలీసులపై హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఐ బొమ్మ రవి పై నాలుగైదు కేసులు కూడా ఉన్నాయి అంటూ సజ్జనార్ వెల్లడించాడు.
ఇక తాజా.. సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. కొంతమంది నిపుణులు అసలు రవిపై పెట్టిన ఏ కేసు కూడా చెల్లదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పైరసీ కంటెంట్ తో ఐబొమ్మ, బెప్పమ్ లాంటి సైట్లను రన్ చేస్తూ దొరికిపోయినా సరే.. రవి పై ఏ కేసులో నిలబడే అవకాశం లేదట. కొంతమంది నిపుణులు తెలియజేస్తూన సమాచారం ప్రకారం.. ఆయన తన వెబ్సైట్ ద్వారా సినిమాలు అప్లోడ్ చేసి ప్రజలకు ఫ్రీగా చూపించాడే గానీ.. అప్లోడ్ చేసి చూసే వాళ్ల దగ్గర ఒక్క రూపాయి కూడా డిమాండ్ చేయలేదు. ఈ క్రమంలోనే ఆయన జనాన్ని దోచుకున్నట్లు కాదు.

ఒకవేళ తన వెబ్సైట్లో సినిమాలు అప్లోడ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అది తప్పు అవుతుంది. అలాంటప్పుడు మాత్రమే కేసు నమోదు అవుతుందంటూ చెప్పుకోస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేయలేదు కనుక ఈ కేస్ నిలబడదని వివరిస్తున్నారు. అలాగే.. తన సైట్లో అప్లోడ్ చేసే కంటెంట్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ చూసి డబ్బులు ఎవరైనా సంపాదించుకుంటే తప్ప.. అతనిపై ఎలాంటి కేసు నిలిచే అవకాశం లేదని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితిని బట్టి ఐబొమ్మ నిర్వాకుడు రవి పై పెట్టిన ఏ కేసు కూడా సాలిడ్ గా నిలిచే అవకాశం లేదట. కొంతమంది నిపుణుల వెల్లడించిన ఈ సమాచారం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. మరి.. ఐ బొమ్మ రవి ఫైనల్ గా శిక్ష భరించాల్సి వస్తుందా.. లేదా.. కేసులన్నీ కొట్టేస్తారా చూడాలి.


