టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పెద్ది. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్‌గా ఈ సినిమాలో మెరవనుంది. ఇక.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. చెర్రీ లుక్ పై క్రేజీ బజ్ క్రియేట్ చేశాయి. ఇక.. తాజాగా అచ్చియ్యమ్మగా జాహ్నవి రోల్ ను పరిచయం చేశారు టీం. ఫస్ట్ సింగిల్ అప్డేట్ కోసం మెగా ఫాన్స్ ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా చరణ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ఆడియన్స్ లో మరింత హైప్‌ను పెంచాశాడు.

పెద్ది నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ రామ్ చరణ్ చాలా రోజుల క్రితమే ఓ ట్విట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్.. ఏఆర్ రెహమాన్ ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడు అనే ఆసక్తి ఆడియన్స్ లో మొదలైంది. ఇక ఫస్ట్ సింగిల్ గా చరణ్, జాన్వి లపై షూట్ చేసిన.. ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ చేయనున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి టైంలో.. ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు, సింగర్ మోహిత్ చౌహన్ కలిసి పనిచేస్తున్న ఓ క్రేజి పిక్ చెర్రీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఏం వండుతున్నారో కాస్త చెప్పండయ్యా అంటూ కామెంట్స్ చేశాడు.
రామ్ చరణ్ పోస్టుపై.. ఏ.ఆర్.రెహమాన్ రియాక్ట్ అవుతూ.. ” చికిరి చిక్కిరి ” చరణ్ గారు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ” చిక్కిరి ” సార్ అంటు బుచ్చిబాబు ఫైర్ ఏమోజీను పంచుకున్నాడు. దీంతో మోహిత్ చౌహన్ పాడిన చిక్కిరి చిక్కిరి అనే సాంగ్ ఫస్ట్ సింగిల్‌గా లాంచ్ చేయబోతున్నట్లు ఆడియన్స్‌కు క్లారిటీ వచ్చేసింది. చెర్రీ షేర్ చేసిన ఈ క్రేజీ పిక్ చూస్తుంటే మోహన్, రహమాన్, బుచ్చిబాబు కలిసి ఏదో ఒక మ్యాజిక్ నే ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నవంబర్ 8న రెహమాన్ హైదరాబాద్లో నిర్వహించే మెగా కాన్సెర్ట్‌లో ఈ సర్ప్రైజ్ ఉండనుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రేపో, ఎల్లుండో.. దీనిపై మరోసారి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
‘Chikiri Chikiri’ Charan garu 😃 https://t.co/fmfwYSJFU8
— A.R.Rahman (@arrahman) November 3, 2025


