అఖండ 2 కోసం ఆ హిట్ సెంటిమెంట్ రిపీట్ చేసిన బోయపాటి.. వర్కౌట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. ప్రస్తుతం అఖండ లాంటి హిట్ మూవీ సీక్వెల్ షూట్లో ఫుల్ బిజీబిజీగా గ‌డిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈ షూట్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇక.. అఖండ లానే అఖండ 2లోను బాలయ్య డ్యూయల్ రోల్ లో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. ఇక చివరిగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజులతో వరుసగా నాలుగు హిట్లు ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఫామ్ లో.. అఖండ 2 సినిమాతో.. మరో బ్లాక్ బస్టర్ కొట్టేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

Akhanda 2 Hindi: Can Boyapati Srinu Repeat Sukumar?

ఇక.. ఈ సినిమాకు బోయపాటి ప్టాన్ అదిరిపోయింది అంటూ.. బాలయ్య కోసం ఆ సూపర్ హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడంటూ ఓ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. అఖండ 2 లో ఆధిపనిశెట్టి విలన్ పాత్రలో మెర‌వ‌నున్న‌ సంగతి తెలిసిందే. గతంలో బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాలో ఆది పిన్నిశెట్టి విలన్‌గా కనిపించి ఆడియన్స్‌ను మెప్పించాడు.

Which CM Son Role Played by Aadhi? | cinejosh.com

ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు.. అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయడానికి అఖండ 2లోను ఆది పిన్నిశెట్టిని మరోసారి బాలయ్య రేంజ్ కు తగ్గట్టుగా పవర్ఫుల్ విలన్ పాత్రలో చూపించనున్నాడట. ఇక ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే బాలయ్య మరోసారి రికార్డ్‌లు బ్రేక్ చేయడం ఖాయమంటూ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.