ఐ బొమ్మ రవికి బిగ్ షాక్.. ఎన్నేళ్ల శిక్ష పడనుందంటే..?

గత రెండు రోజులుగా ఐ బొమ్మ రవికేస్‌ సోషల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. ఈ కేసు రోజుకొ మలుపు తిరుగుతూ.. ఎన్నో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో.. దమ్ముంటే పట్టుకోమంటూ హైదరాబాద్ పోలీసులకు సవాల్ విసిరిన రవి.. ఇప్పుడు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రవికి ఎలాంటి శిక్ష పడుతుంది.. అసలు చట్టం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

రవి ఇమ్మ‌ది.. 60 పైరసీ సైట్లు నడిపాడ‌ని.. దీని ద్వారా వందల కోట్లు సంపాదించాడని.. ఆ డబ్బులు కరేబియన్ లో భారీగా ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక విదేశాలలో ఉండి పైరసీ నెట్వర్క్ నడిపేందుకు స్థానికంగా కొంతమంది అతనికి సహాయం అందించారని.. ఆధారాలతో స‌హ ప‌ట్టుకున్న పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. ఇక.. ఇప్పుడు రవిపై ఈ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నరట.

కాపీరైట్ యాక్ట్ 1957- సెక్షన్ 63,63 ఏ:
ఒరిజినల్ కంటెంట్ దొంగలించి.. అక్రమంగా పంచడం.. తీనికి 6 నెలల నుంచి.. 3 సంవత్సరాల జైలు శిక్ష.. రూ.50 వేల నుంచి 2 లక్షల వరకు జ‌రిమాన‌.

ఐటి యాక్ట్ సెక్షన్ 66, 66B, 66 C, 66 D:
హాకింగ్ డేటా.. దోపిడి అనాధికారిక యాక్సిస్ వల్ల 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఐపీసీ సెక్షన్:
అ వాస్త‌వ‌ ఇన్ఫర్మేషన్‌తో ఆదాయం దక్కించుకున్నాడు. దోప్పడికి సహాయం చేసిన సహకారులకు కూడా.. ఐపీసీ సెక్షన్ వర్తిస్తుంది.

మనీ లాండరింగ్:
పైరసీ ద్వారా సంపాదించిన డబ్బు విదేశాలకు పంపితే.. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం.. ఈడి కేస్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతుంది. అక్రమ ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంటుంది.

ఇక రవి మొత్తం నెట్వర్క్ ట్రాక్ చేసి.. ఐ బొమ్మకు సంబంధించిన సర్వర్లు, డొమైన్లు ఎవరు ఇచ్చారో గుర్తించడం.. సంపాదించిన డబ్బు ఎక్కడకు వెళ్లిందో ఫాలో ఆఫ్ చేయ‌డం.. విదేశీ సహకారం ఉంటే ఇంటర్పోల్ సహాయం కోరి వాళ్లను కూడా అదుపులోకి తీసుకోవడం.. ఓటీటీ కంపెనీలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కొత్త కేసులు నమోదు చేయడం.. ఇప్పుడు పోలీసుల నెక్స్ట్ యాక్షన్ అని తెలుస్తుంది.