టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా సక్సెస్ అందుకుంటున్న ఎంతోమంది కేవలం నటన రంగానికి కాదు.. బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి భారీ ఆస్తులను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఎంతోమంది స్టార్ హీరోలకు ఇన్స్పిరేషన్ గా నిలిచి.. ఆల్ టైం రికార్డుల్లో.. ముందుండి తన ఆదాయాన్ని స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తూ.. వేలకోట్ల ఆస్తులను కొల్లగొట్టిన హీరో ఎవరు..? చాలామందికి తెలియదు. ఆయన ఓ లెజెండ్రి ఫిగర్. తాను పెట్టుబడులు పెట్టడమే కాదు.. భూమిపై పెట్టుబడులు పెట్టి భవిష్యత్తును రక్షించుకోండి అంటూ ఎంతో మంది నటీనటులకు సలహాలు ఇచ్చి ఇన్స్పిరేషన్ గా మారాడు. నటుడుగా రాణిస్తున్నంత కాలం.. ఫైనాన్షియల్ డిస్ప్లేన్‌కు క్యారఫ్ అడ్రస్‌గా నిలిచాడు.
సినిమాల్లో.. హిట్స్ వచ్చి భారీ రెమ్యూనరేషన్ అందుకున్నా.. ఆ సంపాదన లగ్జరీ లైఫ్ కోసం కాకుండా.. భవిష్యత్తు ప్రమాణాల కోసం ఉపయోగిస్తూ వచ్చాడు. ఆయన చుట్టూ ఉన్న తోటి నటీనటులకు ఫ్రెండ్స్ కు కూడా తన సక్సెస్ మంత్రాలు సజెస్ట్ చేస్తూ వచ్చాడు. ఎంతోమంది ఫిలిం ప్రొడక్షన్, పార్ట్నర్‌షిప్‌లు అంటూ బిజినెస్‌లో డబ్బులు కోల్పోతుంటే.. ఆయన వాళ్ళందరిని చూసి భిన్నంగా ఆలోచన చేశాడు. పార్టనర్‌షిప్‌లలో పెట్టకుండా.. ఫిలిమ్స్ లో మాత్రం కొద్దిగా ఇన్వెస్ట్ చెయ్.. కానీ మిగతా పెట్టుబడులు భూములు పై పెట్టు అని సలహాలు ఇస్తూ ఉండేవాడట. ఎందుకంటే.. భూమి మాత్రమే శాశ్వతంగా ఉండే ఆస్తి అంటూ సజెస్ట్ చేస్తూ వచ్చేవాడట. అది తనకు మాత్రమే కాదు.. ఎంతో మంది నటినటులకు తిరుగులేని డెసిషన్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ హీరో ఎవరో చెప్పలేదు కదా ఆయనే శోభన్ బాబు. నటభూషణ్, సోగ్గాడుగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ లెజెండ్రీ హీరో.. తన ఫైనాన్షియల్ విజన్ తో తెలుగు హిస్టరీలోనే అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు.
1959లో భక్త శబరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభన్ బాబు.. తన సినీ కెరీర్‌లో ఎన్నో తిరుగులేని హిట్స్ అందుకున్నాడు. అయితే.. ఆయన నిజమైన సక్సెస్ సీక్రెట్ మాత్రం స్క్రీన్‌పై కాదు.. రియల్ ఎస్టేట్స్‌లో ఉంది. ఎన్నో అధ్యయనాలు చేసి చెన్నై చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో.. ఫ్లాట్లు, భూములలో పెట్టుబడులు పెట్టాడు. ఒకే చోట పెద్ద మొత్తం కాకుండా.. రిస్క్ తగ్గించడానికి రకరకాల ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. మార్కెట్ ట్రెండ్స్ ప్రభుత్వ ప్రాజెక్టులు , రోడ్డు విస్తరణ ఇవన్నీ క్లియర్గా అధ్యయనం చేసి.. ఎక్స్పర్ట్‌ల సలహాలతో డెవలప్ అయ్యే ప్రాంతాల్లోనే ఆస్తులను కొన్నాడు. దీని ఫలితంగా చిన్న ఇన్వెస్ట్మెంట్తో భారీ రిటర్న్స్ దక్కించుకున్నాడు. అలా శోభన్ బాబు చనిపోయే సమయానికి (2008లో) ఆస్తులు విలువ సుమారు రూ.80,000 కోట్లకు పైగా ఉందని సమాచారం. ఇక ఇప్పటి మార్కెట్ గ్రోత్తో అది మరిన్ని లక్షల కోట్లకు చేరుకున్నాయట. ఇక ఇండస్ట్రీలో ఈయన సజెషన్‌తోనే మురళీమోహన్, చంద్రమోహన్ లాంటి వాళ్లు కూడా రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెట్టి భారీ లాభాలను పొందినట్లు చెప్పుకొచ్చారు.

