టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా రూపొందించిన సెన్సేషనల్ మూవీ బాహుబలి. దాదాపు 10 ఏళ్ల క్రితం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సిరీస్.. బాహుబలి ది బిగినింగ్, ది కంక్లూషన్ రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి.. ఏ రేంజ్‌లో సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో, చాలాచోట్ల రికార్డ్ లెవెల్ కలెక్షన్లు కొల్లగొట్టి.. భారతీయ సినీ ఖ్యాతిని రెట్టింపు చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర నూతన అధ్యాయాన్ని లిక్కించిందని చెప్పాలి.
ఈ క్రమంలోనే.. తాజాగా మరోసారి ప్రపంచ సినీ ఆడియన్స్‌ను పలకరించేందుకు.. ఈ మూవీ మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాను.. రెండు భాగాలు కలిపి ఒకే భాగంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ,తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ఈ సినిమాలో తమ నటనతో ఆకట్టుకున్నారు. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా.. కేకే సెంథిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక.. నిన్న గ్రాండ్ లెవెల్ లో సినిమా ఫ్రీ సేల్స్ లోనే కలెక్షన్స్ అదరగొట్టింది. ఈ సినిమా ప్రీ సేల్స్‌తో కలుపుకొన్ని.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతో ఒకసారి చూద్దాం.
బాహుబలి ది బిగినింగ్.. ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్ల వసూళ్ల కొల్లగొట్టగా.. ది కంక్లూషన్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1810 కోట్ల కలెక్షన్లు దక్కెంచుకుంది, ఇక తాజాగా ఈ రెండు సిరీస్లను కలిపి ఒక్కటే సినిమాగా బాహుబలి ది ఎపిక్ పేనుతో అక్టోబర్ 31న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయగా.. ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ ద్వారానే రూ.9.25 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక.. అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్ అయిన ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్స్ అన్నింటినీ కలుపుకొని బాహుబలి రూ.10.4 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. అంతేకాదు.. ఇప్పటివరకు ఫ్రీ రిలీజ్ కలెక్షన్లు కొల్లగొట్టిన విజయ్ (గిల్లి), మహేష్ బాబు (ఖలేజా) సినిమాల కలెక్షన్ల రికార్డును సైతం బ్రేక్ చేసింది.

