వివాదంలో యాంకర్ శివజ్యోతి.. తిరుమల ప్రసాదం పై అనుచిత కామెంట్స్ (వీడియో)..!

యాంకర్ శివ జ్యోతికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలంగాణ యాసలో.. తనదైన స్టైల్‌లో తీన్మార్ వార్తలు చదువుతూ.. సావిత్రి అక్క‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శివ జ్యోతి.. అదే క్రేజ్‌తో బిగ్బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని షోలకు యాంకర్ గాను వ్య‌వహ‌రించింది. ప్రస్తుతం శివజ్యోతి పలు స్పెషల్ ఈవెంట్స్‌లో సందడి చేస్తూ బిజీగా గ‌డుపుతుంది. అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల‌లోను తళ్లుకున‌ మెరుస్తుంది. ఇక.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఓ వివాదంతో నెటింట వైరల్‌గా మారుతుంది. తిరుపతి శ్రీవారి దర్శనం క్యూ లైన్‌లో ఇచ్చే అన్న ప్రసాదం పై చేసిన కామెంట్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

Anchor Shiva Jyothi controversy comments on Tirumala prasadam distributed  by ttd in queue line pa |Shiva Jyothi: పెద్ద వివాదంలో యాంకర్ శివజ్యోతి..  ఏకంగా తిరుమల ప్రసాదంపై వివాదాస్పద ...

ఈ క్రమంలోనే.. ఆమె కామెంట్లు సోషల్ మీడియాలో దుమారంగా మారాయి. టిటిడి క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసినట్లు సమాచారం. తన ఫ్రెండ్ సోను అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని తీసుకుంటుండగా.. శివజ్యోతి మాట్లాడుతూ.. సోను కాస్ట్లీ ప్రసాదాన్ని అడుకుంటున్నాడు ఫ్రెండ్స్ అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది. జీవితంలో ఎప్పుడు అడ్డుకోలేదు.. ఫస్ట్ టైం అడుక్కున్నా అంటూ త‌న ఫ్రెండ్ రియాక్ట్ అయ్యాడు. తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటూ శివజ్యోతి నవ్వుకుంది. అడుక్కున్నా కానీ.. చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటూ శివ జ్యోతి ఫ్రెండ్ రియాక్ట్ అయ్యాడు. అయితే.. ప్రసాదం గురించి శివజ్యోతి తన ఫ్రెండ్ కలిసి నవ్వుతూ చేసిన ఈ కాన్వర్జేషన్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

తీవ్ర వివాదంలో యాంకర్ శివజ్యోతి.. తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు

దీంతో శ్రీవారి భక్తులు, నెటిజ‌న్లు.. సోషల్ మీడియా వేదికగా త‌నపై ఫైర్ అవుతున్నారు. వెంకన్న.. అన్న ప్రసాదాన్ని, భక్తులను అవమానించిందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆమె నిజ స్వరూపమని.. యాత్రిక్కులను బిచ్చగాళ్లతో పోల్చుతూ ఆమె కామెంట్స్ చేసిందని.. ప్రసాదం అడుగుతున్న వాళ్లను మాత్రం కుబేరులతో పోల్చుకుంటున్నారని.. ఇప్పటికి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ చేసే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు.. కర్మ సరైన టైంలో సరైన బుద్ధి చెప్తుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై శివ జ్యోతి రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.