టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్ ,అఖండ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న మూవీ అఖండ 2 తాండవం. గతంలో.. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అఖండ సీక్వెల్‌గా ఇది రూపొందుతుంది. జగపతిబాబు, అది పిన్నిశెట్టి.. ఈ సినిమాలో కీలక పాత్రలో మెరమనున్నారు. అంతేకాదు.. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించడం మరో హైలెట్. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా.. సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్‌లుక్, గ్లింప్స్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ తాండవం సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న క్రమంలో.. ప్రమోషన్స్ సైతం పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు టీం. ఇందులో భాగంగానే.. నిన్న సాయంత్రం ముంబైలో ఈ సాంగ్ లంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో భాగంగా బాలయ్య, బోయపాటి, థయన్‌తో పాటు.. సినిమా టీమ్ అంతా సందడి చేశారు. ఇక బాలకృష్ణ ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. నేను ఉదయం 3 గంటలకు లేస్తా.. పూజలు చేస్తా.. మూడుసార్లు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా సక్సెస్ అందుకున్నా అంటూ వివరించాడు. ఫ్యాన్స్ తో నాకున్న బాండ్ ఎవరు విడదీయలేనిదని.. నేను చేసిన నాలుగు సినిమాలు వరుసగా సక్సెస్ అందుకున్నాయి.
అఖండ నుంచి స్టార్ట్ అయిన ఈ సక్సెస్ ట్రాక్.. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌లతో కంటిన్యూ అవుతూ వచ్చింది.. ఇప్పుడు అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాయని కొందరు చెన్తున్నారు.. ఆ ఈశ్వరుడి బ్లెస్సింగ్స్ తో ముందుకు వెళ్తున్న నాకు.. డిక్షనరీలోనే సెకండ్ ఇన్నింగ్స్ అనే పదం లేదు అంటూ బాలయ్య కాబెంట్స్ చేశాడు. సనాతన ధర్మం, హిందూ ధర్మం గొప్పతనం గురించి అఖండ 2లో కళ్ళకు కట్టినట్లు చూస్తారు. నిజాయితీగా నడిస్తే.. ధర్మం బతుకుతుంది.. అన్యాయం ముందు తలవంచకుడదు.. ఇదే అఖండ 2 అని బాయ్య వివరించాడు. డైరెక్టర్ బోయపాటితో హ్యాట్రిక్ సక్సెస్ ఉంది. మేము ఎక్కువ మాట్లాడుకోము.. కేవలం 130 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసాం. గౌతమి పుత్ర శాతకర్ణిను 70 రోజుల్లో ముగించేసాం. నాకు స్పీడ్గా సినిమాలు చేయడం ఇష్టం అంటూ బాలయ్య వివరించాడు. అయితే ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.


