టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2.. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ అంచనాలకు తగ్గట్టుగానే అఖండ 2 నుంచి తాజాగా ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక.. ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ అంతా.. బాలయ్య సినిమాలో నటవిశ్వరూపాన్ని చూపించడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దేశం జోలికి వస్తే మీరు దండిస్తారేమో.. ధర్మం జోలికి వస్తే మేము ఖండిస్తాం.. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్.. ఇప్పటివరకు చిత్రపటంలో మా దేశం రూపాన్ని చూసి ఉంటారు.. ఎప్పుడు విశ్వరూపాన్ని చూసి ఉండరు.. మేము ఒక్కసారి లేచి శబ్దం చేస్తే ప్రపంచమంతా నిశబ్దం అవుతుందంటూ బాలయ్య చెప్పిన రెండు డైలాగ్స్ ట్రైలర్‌కు మరింత హైలెట్‌గా నిలిచాయి. ఫ్యాన్స్‌లో గూస్బంన్స్ తెప్పించాయి. ఇక ఈ మూవీలో డైరెక్టర్ రవి రాజా పిన్ని శెట్టి తనయుడు.. ఆది పిన్నిశెట్టి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన సరైనోడు లో నటించిన ఆది.. ఇప్పుడు అఖండ 2 కోసం మళ్ళీ అదే నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడట.
ఇందులో భాగంగానే.. అఖండ 2 ప్రమోషన్స్‌లో భాగంగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన ఆది.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గురించి భారీ ఎలివేషన్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.. ఈ సినిమా నేల టికెట్లో చూసే ఆడియన్స్‌ను కూడా.. సినిమా అయ్యేసరికి బాల్కనీలో నుంచో పెడుతుంది అంటూ కామెంట్స్ చేసి సినిమాపై హైప్‌ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తాడు. సినిమా ఇచ్చే ఎనర్జీ, ఎమోషన్, హై వోల్టేజ్ స్క్రీన్ ప్రజెన్స్ కారణంగా ఆడియన్స్ గాల్లో తేలిపోతారంటూ.. హ్యాపీనెస్ లో ఉంటారని అది వివరించాడు. ఈ కామెంట్స్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని అర్థం అవుతుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.



