తారక్ – నీల్ మూవీ సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో సందడి చేసిన యష్, శ్రీ లీల వీడియో వైరల్..!

కేజిఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, సలార్ సినిమాలతో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ్ లైఫ్ లో సరికొత్త అధ్యయనం తాజాగా మొదలైంది. శుక్రవారం.. నికితా అనే యువతని ఆయన గ్రాండ్ లెవెల్ లో వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో ఇరు కుటుంబాలతో పాటు.. పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతోమంది సెలబ్రిటీస్ హాజరై జంటను ఆశీర్వదించారు. తన భార్య రాధికా పండిట్ తో కలిసి హీరో య‌ష్ సందడి చేశాడు.

సలార్' సినిమాటోగ్రాఫర్ పెళ్లి.. ప్రశాంత్ నీల్, యష్, శ్రీలీల సందడి (ఫొటోలు)  | KGF cinematographer Bhuvan Gowda And Nikitha Wedding Photos | Sakshi

స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అలాగే.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీలి సైతం తన వైఫ్‌తో కలిసి వేడుకల్లో పాల్గొన్నాడు. వీళ్ళిద్దరితోపాటు హీరోయిన్ శ్రీ లీలా, శ్రీనిధి శెట్టి, శ్రీనివాస్త‌, గరుడ రామ్ తదితరులు వివాహ వేడుకల్లో హాజరయ్యారు. ఇక ప్రజంట్ భువన్ గౌడ.. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్‌ నిల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ డ్రాగన్‌కు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Sreeleela At Bhuvan Gowda Marriage,Bhuvan Gowda Wedding: 'ఎన్టీఆర్ నీల్'  డీఓపీ పెళ్లిలో సందడి చేసిన యష్, శ్రీలీల, శ్రీనిధి శెట్టి, శాన్వీ.. ఫోటోలు  వైరల్.. - kgf salaar ntrneel ...

ఈ పెళ్లి తర్వాత కొద్ది రోజుల విరామం తీసుకుని మళ్ళీ షూట్ సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు భువన్ గౌడ. వెడ్డింగ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఫోటోలలో సినీ సెలబ్రిటీ జంటలు.. నవ దంపతులను ఆశీర్వదిస్తున్న క్షణాలు ఆడియన్స్ కట్టిపడేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫాన్స్‌, సినీ ఆడియో సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.