టాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ మీనా గురించి పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్గా మరి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని.. బాలయ్య, నాగార్జున, వెంకటేష్, రజనీ ఇలా ఎంతోమంది సూపర్ స్టార్లతో నటించి బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలోని హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా ఒకప్పుడు చక్రం తిప్పింది. ఇక ఇప్పటికి ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉంటూ.. సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా మెరుస్తుంది.

సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. నిత్యం ఏదో ఒక క్రేజీ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అందరిని తన వైపు తిప్పుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మీనా కూతురు.. నైనిక ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇన్నాళ్లు ముద్దు ముద్దుగా.. క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన నైనిక చాలా కాలం గ్యాప్ తర్వాత కెమెరా ముందు మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోస్ చూసిన నెటిజన్స్.. నైనికా అందంలో తల్లిని మించిపోయిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడే ఇంత పెద్దదైపోయిందా.. ఇంత అందంగా మారిపోయిందా అంటూ.. ప్రిన్సెస్ సిండ్రెల్లా లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తేరి సినిమాతో ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. విజయ్ కూతురిగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత పల సినిమాల్లో మెరిసింది. ఇక ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టిన ఈ అమ్మడు.. సినిమాల విషయంలో తల్లిని ఫాలో కాబోతుందట. కొంతకాలం గ్యాప్ తర్వాత సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందంటూ టాక్ నడుస్తుంది.

