ఈ పై ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ హాండ్సమ్ హీరోని గుర్తుపట్టారా.. నేను ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. అమ్మాయిల కలల రాకమాడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికి.. పలు సినిమాల్లో హీరోగా మెరుస్తూనే, మరో పక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనుకుంటే.. ఇతర సినిమాల్లోను కీలక పాత్రల్లో సైతం నటిస్తున్నాడు. అది కూడా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటున్నాడు.

ఇందులో భాగంగానే.. ఎక్కువగా బయోపిక్ సినిమాల్లో నటిస్తున్నాడు. వయసు 50 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ కుర్ర హీరోలను మించిపోయే ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే.. తాజాగా ఈయన ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయి దర్శనమిచ్చాడు. పాన్ ఇండియాలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరోను మీరు గుర్తుపడితే నిజంగానే జీనియస్. ఇంతకీ ఆయన ఎవరో కనిపెట్టారా. సర్లేండి.. అది కాస్త కష్టమేలెండి.. మేమే చెప్పేస్తాం. అతనే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒక్కడైనా మాధవన్. గతంలో ఎక్కువగా యూత్, లవ్, రొమాంటిక్ సినిమాల్లో నటించి మెప్పించిన మాధవన్.. ప్రజెంట్ ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ.. ప్రముఖ సైంటిస్ట్ నంబి నారాయణ బయోపిక్ లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

అద్భుత నటనకు అవార్డు సైతం దక్కించుకొన్నాడు. ప్రస్తుతం జీడీ నాయుడు అనే మరో బయోపిక్ లో నటిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన ఫస్ట్ లుక్ రిలీజై నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఈ జీడి నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. తమిళనాడు కోయంబత్తూర్ లో పుట్టిన జీడి నాయుడు ఎన్నో ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం మనం డైలీ లైఫ్ లో వినియోగిస్తున్న జూస్ పిండే మిషన్, కాయిన్ తో పనిచేసే ఫోనోగ్రాఫ్, ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్, 16 ఎమ్ ఎమ్ ప్రొజెక్టర్, ఓటు రికార్డింగ్ మిషన్ ఈ యంత్రాలన్నింటిలోనూ జీడి నాయుడు పాత్ర కీలకంగా ఉంది. అలాగే.. దేశంలో ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజీని పెట్టినది కూడా ఈయనే కావడం విశేషం. అలాంటి వ్యక్తి బయోపిక్ లో మాధవన్ లీడ్ రోల్‌లో నటిస్తుండటం.. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో అంతా ఆయనను చూసి ఆశ్చర్యపోతున్నారు.

