2025 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ అంతా కాస్త డల్ గానే కొనసాగిన.. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ జోష్ గా కొనసాగుతుంది. సెప్టెంబర్ నెలలో మొదలైన టాలీవుడ్ వరస సినిమాల ఉత్సవం.. అక్టోబర్ లోను అదే ఊపును కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఓజీ, కాంతారా చాప్టర్ 1 సినిమాలు భారీ సక్సెస్‌లో అందుకున్నాయి. ఇప్పటికి థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇక ముందు ముందు మరింత ముఖ్యమైన దీపావళి సీజన్ లోకి టాలీవుడ్ అడుగుపెట్టనుంది. ఇక ఈ సీజన్లో టాలీవుడ్ బడా హీరోల సినిమాలు రిలీజ్ కాకపోయినా.. కనీసం మీడ్‌రేంజ్ హీరోల సినిమాలు మాత్రం రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. దీపావళి హంగామా కచ్చితంగా కనపడుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలను వరసగా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 16న మిత్రమండలి, 17న తెలుసు కదా, అలాగే డ్యూడ్ సినిమాలను.. 18న కే – ర్యాంప్ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
ఫస్ట్.. 16న రిలీజ్ కానున్న మిత్రమండలి సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ మొదలైంది. బన్నివాస్ ప్రొడ్యూసర్ గా ప్రియదర్శి హీరోగా నటించినన్న ఈ సినిమా ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. సినిమా నుంచి రిలీజ్ లో మంచి రెస్పాన్స్ని దక్కించుకున్నాయి. ఇక ప్రియదర్శి కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్లను మంచి అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 15 నుంచి సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయని టీం కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక 17న.. ఒకటి కాదు రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి. ఒకటి సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీ వస్తుంది. మిరాయ్ లాంటి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యానర్‌లో.. తెలుసు కదా తో మరో హిట్ పడుతుందని టీం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాలో రాశి కన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ల గా మెరవనున్నారు. తమన్ మ్యూజిక్ అందించడం సినిమాకు మరో ప్లస్. సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ మొదలైంది.
అదే రోజున మైత్రి మేకర్స్ డ్యూడ్ మూవీ రిలీజ్ చేయనన్నారు. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ప్రదీప్ రంగనాథ్ హీరోగా.. ఈ సినిమా రూపొందింది. ఫుల్ ఆఫ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ ఎనర్జీ, ఫుల్ లెవెల్ ఫన్‌తో చూపించారు. ఈ క్రమంలోని సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీతో ప్రదీప్ మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ దక్కించుకోవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 18న కిరణ్ అబ్బవరం నుంచి కే – ర్యాంప్ సినిమా వస్తుంది. హాస్య మూవీస్ బ్యానర్.. యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ లోనే కిరణ్ సరికొత్త బాడీ లాంగ్వేజ్, స్టైల్ తో ఆడియన్స్‌ను మెప్పించాడు. దీపావళి చివర్లో రిలీజ్ కావడం కూడా కాస్త కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో నాలుగు సినిమాల్లో కనీసం రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నా చాలు.. దీపావళి మోతకు టాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.