ప్రస్తుత జనరేషన్లో ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. కారణాలు ఏవైనా పెళ్లి బంధం మూడు నెలల ముచ్చటగా మిగిలిపోతుంది. చాలాకాలం రిలేషన్లో ఉండి పిల్లల్ని కూడా కన్న తర్వాత కూడా.. స్టార్ కపుల్ ఎంతోమంది అనూహ్యంగా విడిపోతూ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో మరో స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వైరల్‌గా మారుతుంది. మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని 14 ఏళ్ల కాపురం చేసి ముగ్గురు బిడ్డలకు కూడా జన్మనిచ్చిన తర్వాత దాంపత్య బంధానికి చెక్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు.

త్వరలో ఈ ఆదర్శ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా దరఖాస్తు చేశారంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ జంట మరెవరో కాదు. జై భానుషాలి – మహి విజ్ పేర్లు టాలీవుడ్ ఆడియన్స్‌కు పెద్దగా పరిచయాలు లేకపోయినా.. బాలీవుడ్ లో సీరియల్స్ చూసే ఆడియన్స్‌కు మాత్రం పరిచయాలు అవసరం లేదు. ఇక మహి విజ్ మాత్రం టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా.. చాలా వరకు తెలిసే ఉంటుంది. 2004లో రిలీజ్ అయినా తపన మూవీలో ఈమె హీరోయిన్గా మెరిసింది.

తర్వాత కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. అయితే.. బాలీవుడ్లో సెటిల్ అయినా జై భానుషాలి, మహి విజ్.. లవ్ మ్యారేజ్ 2011లో వీరిద్దరు వివాహం చేసుకొని ఒకటయ్యారు. తర్వాత చాలా ఏళ్ల వరకు సంతానం కలగకపోవడంతో ఐవిఎఫ్ ద్వారా ప్రయత్నాలు చేసి మూడు సార్లు ఫెయిల్ అయ్యారు. దీంతో 2017లో జే భానుషాలి, మహి విజ్.. రాజ్వీర్, కుషీలను దత్తత తీసుకున్నారు. తర్వాత 2019లో మరోసారి ఐవీఎఫ్ ద్వారా కూతురు తారకు జన్మనిచ్చారు. ఇప్పుడు దంపతులు విడాకుల క్రమంలో ముగ్గురు పిల్లల బాధ్యతలను కూడా సమానంగా పంచుకోవాలని ఫిక్స్ అయ్యారంటూ టాక్ నడుస్తుంది. ఇద్దరు పరస్పర అనుమతులతో విడాకులు తీసుకోబోతున్నారని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.

