స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకోవడానికి.. వరుస సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడానికి కారణం ఏంటో తాజాగా రివీల్ అయింది. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా లాంటి వరస బ్లాక్ బాస్టర్లు అందుకున్న ఈ అమ్మడికి.. నిర్మాతలు అందరూ వరుసగా ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటో తాజాగా.. టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ రివీల్ చేశాడు. సినిమా ఈవెంట్లో ఆయన దీనిపై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల కాలంలో హీరోయిన్ దీపిక పని గంటల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆమె వార్తల్లో తెగ వైరల్ గా మారింది. కేవలం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానంటూ తేల్చి చెప్పడంతో కొంతమంది నిర్మాతలు అభ్యంతరం తెలుపుతూ.. తమ సినిమాల నుంచి కూడా తప్పించారు. ఇలాంటి నేపథ్యంలో.. నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ఎన్ని గంటలు పనిచేయాలని చర్చ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న టైం లో.. ఎన్ని గంటలైనా పని చేయడానికి సిద్ధమవుతున్న ఏకైక హీరోయిన్ రష్మిక మందన. ఆమె పనిని కష్టంగా కాదు.. ఇష్టంగా చూస్తారు. సినిమాను లవ్ చేస్తారు. పని గంటలు లెక్కల్లో చూడరు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎస్కేఎన్ చేసిన కామెంట్స్‌తో రష్మికకు సినీ ఇండస్ట్రీలో ఉన్న గౌరవంతో.. ఆమెకు సినిమాపై ఉన్న నిబద్ధత ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. టైం విషయంలో రష్మిక మందన నిబద్ధతలు పాటించాలని.. ఆమెకు కఠినమైన పరిమితులు ఏమీ ఉండవు.

అందుకే.. అందరూ రష్మిక మందన్నను తమ ఫ్యామిలీ మెంబర్గా చూస్తారు అంటూ నిర్మాత ఎస్కేఎన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం.. దీపిక పదుకొనే డిమాండ్ సరైనదే అంటూ కొందరి నుంచి వాదనలు వినిపిస్తున్న టైం లోను.. రష్మిక ఎలాంటి పరిమితులు లేకుండా పనిచేయడం వల్లే ఆమెకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయంటూ ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం రష్మిక వరుస పాన్ ఇండియా సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సౌత్ నార్త్ అని తేడా లేకుండా.. దాదాపు అన్ని ఇండస్ట్రీలోనూ మంచి డిమాండ్ ను సంపాదించుకొని దూసుకుపోతుంది. ప్రస్తుతం తాను కన్నడ నటుడు దీక్షిత్ శెట్టితో కలిసి నటించిన ది గర్ల్ ఫ్రెండ్స్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవల సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

