ఇదో మాస్టర్ పీస్.. ఇండియన్ ఇండస్ట్రీలో సినిమాటిక్ తుఫాన్.. కాంతారా చాప్టర్ 1 పై సందీప్ రివ్యూ..

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 రిలీజై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి నటనకే కాదు.. కంటెంట్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చాప్టర్ వన్ పై తన రివ్యూ ని షేర్ చేసుకున్నాడు. ప్రశంసల వర్షం కురిపించాడు. కొద్ది గంటల క్రితం ఎక్స్ వేదికగా సందీప్ ఈ సినిమాపై రియాక్ట్ అయ్యాడు.

ఈరోజు తెల్లవారుజామున ఎక్స్ వేదికగా సందీప్ రియాక్ట్ అవుతూ.. వీటిని కాంతర చాప్టర్ 1 ఒక నిజమైన కళాఖండం అంటూ వివరించాడు. భారతీయ సినీ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని ఒక‌ అద్భుతాన్ని ఇది క్రియేట్ చేసింది. ఇది సినిమాటిక్ తుఫాన్. రా ,డివైన్, షేకబుల్ అంటూ చెప్పుకోచాడు. రిష‌బ్‌ శెట్టి.. నిజమైన వన్ మాన్ షో చూపించాడని.. అదరగొట్టాడంటూ ప్రశంస‌లు కురిపించాడు. ఒక్కడే దీనిని రూపొందించి మొత్తం తన భుజాలపై మోసాడు.. ఇక అజ్నీష్‌లోక్ నాధ్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ సందీప్ తెగ పొగిడేస్తాడు.

Sandeep Reddy Vanga Labels Kantara Chapter 1 as a 'Cinematic Thunderstorm':  Rishab Shetty Shines in a Solo Performance | Zoom TV

సందీప్ రెడ్డి.. పోస్ట్‌పై రిషబ్‌ రియాక్ట్ అవుతూ.. థాంక్యూ బ్రదర్ అంటూ వివరించాడు. అంతేకాదు.. మరో పోస్ట్ ద్వారా సినిమా రిలీజ్, పర్ఫామెన్స్ పట్ల ఎమోషనల్ అయ్యాడు. 2016లో ఈవినింగ్ షో టికెట్ దొరకడానికి టికెట్లు కష్టమైన స్టేజ్ నుంచి.. 2025లో 5000 హౌస్ ఫుల్ షోలే వరకు మా ప్రయాణం కొనసాగింది. మీ ప్రేమ, మద్దతు, దేవుడి దయ వాళ్లనే ఇది సాధ్యమైంది. దీన్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి ఎప్పటికీ కృతజ్ఞుడిని అంటూ రిషబ్ ట్విట్ చేశాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరి పోస్ట్‌లు వైరల్ గా మారుతున్నాయి.