లాక్ డౌన్ తర్వాత డిజిటల్ ప్లాట్ఫార్మ్కు జనం బాగా అలవాటు పడిపోయారు. ఇక అలాంటి ఓటీటీ ప్లాట్ఫిమ్లలో ఒకటైన నెట్ఫ్లీక్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తూ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటుంది. కోట్లాదిమంది ఇందులో సినిమాలను వీక్షిస్తున్నారు. మన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ రెస్పాన్స్ రావడానికి, ఆస్కార్ రావడానికి ప్రధాన కారణం కూడా నెట్‌ఫ్లిక్స్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే.. రీసెంట్గా సినిమా సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తెలుగు తో పాటు.. హిందీ, తమిళ్ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది.
ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చిన గణాంకాల ప్రకారం.. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా 32 లక్షల వ్యూస్ ను దక్కించుకోవడం విశేషం. 2024 నుంచి 2025 వరకు రిలీజ్ అయిన అన్ని పాన్ ఇండియన్ మరియు ప్రాంతీయ భాషా సినిమాలను కలిపి చూస్తే ఈ సినిమా టాప్ 5లో స్థానాన్ని దక్కించుకుంది. కానీ.. ఫ్యాన్స్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తుందని భావించారు. ఆ రేంజ్ వ్యూస్‌ను మాత్రం టచ్ చేయలేకపోయింది. ప్రస్తుతానికి పుష్ప 2 నెట్‌ఫ్లిక్స్‌లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ 1 సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో 58 లక్షల వ్యూస్ దక్కించుకుంది.
తర్వాత స్థానంలో 51 లక్షల వ్యూస్ తో లక్కీ భాస్కర్ నిల్చింది. ఇక మూడవ స్థానంలో ప్రభాస్ కల్కి హిందీ వర్షన్ 45 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏంటంటే నేచురల్ స్టార్ నాని హిట్ 3 సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే 42 లక్షల వ్యూస్ సొంతం చేసుకుని టాప్ ఫోర్ లో చోటు దక్కించుకుంది. ఓజీ సినిమా హిట్ 3 వ్యూస్ ని దాటడంలో ఫెయిల్ అయ్యింది. ఈ క్రమంలోనే ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఓజీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినా.. ఆల్ టైం రికార్డ్ ను మాత్రం టచ్ చేయలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


