టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. ఇప్పటివరకు 8 సీజన్లను కంప్లీట్ చేసి.. కొద్ది వారాల క్రితం గ్రాండ్గా 9వ సీజన్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 9వ సీజన్ సైతం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అయితే.. కొన్ని ఎపిసోడ్లో ఆడియన్స్ కు ఫుల్ బోరింగ్ గా ఉండడం.. బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ తగ్గుతూ రావడంతో.. దీన్ని గమనించిన షో మేనేజ్మెంట్.. వెంటనే ఆటను ఆసక్తిగా మార్చేందుకు ఫైర్ స్ట్రామ్ పేరుతో.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి పంపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. షో పై విపరీతమైన నెగెటివిటీ మొదలైంది. దానికి కారణం షోలో అడుగుపెట్టిన ఆరుగురు కంటెస్టెంట్స్‌లో.. ఇద్దరు కంటెస్టెంట్స్. మిగతా నలుగురు కంటెంట్ల సంగతి ఎలా ఉన్నా.. దివ్వెల మాదిరి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యల విషయంలో మాత్రం ఆడియన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. బిగ్ బాస్ షో పై మొన్నటి వరకు ఉన్న గౌరవం కాస్త ఈ ఎపిసోడ్ తో పోయిందని.. కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. కారణం వీళ్లిద్దరి బ్యాగ్రౌండ్. దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కాండిడేట్ తో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య వాణి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న.. శ్రీనివాస్ తన భార్యకు విడాకులు ఇచ్చేసి మరి మాధురితో సెటిల్ అయ్యాడు. అప్పటికే 3 ఆడపిల్లల తల్లి అయిన మాధురి భర్తకు విడాకులు ఇచ్చేసి శ్రీనివాస్‌తో సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే పెళ్లి కాకుండానే.. దేవాలయాలకు, ఈవెంట్లకు చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు ఈ జంట. దీంతో ఇప్పటికే జనంలో విపరీతమైన నెగెటివిటీ నెలకొంది.
ఎంతోమంది దుమ్మెత్తిపోస్తున్న నేను చేసింది కరెక్ట్.. సమాజమంతా తప్పంటూ మాధురి ఎన్నో డిబేట్లో వాదిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెను బిగ్బాస్ హౌస్కి తీసుకురావడం విషయంలో.. షోపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక మరో కంటెస్టెంట్.. అలేఖ్య చిట్టి పీకిల్స్ రమ్య సైతం నాన్ వెజ్ పికిల్స్ తయారు చేస్తూ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తు.. వారికి డోర్ డెలివరీ అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ఓ వ్యక్తి పికిల్స్ రేట్లపై మాట్లాడడం అతనిపై బండబూతులతో విరుచుకు పడడం.. తర్వాత ఆమెను కవర్ చేస్తూ రమ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారంగా మారాయి. అంతేకాదు.. ఆమె సోషల్ మీడియాలో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేందుకు చేసే ఎక్స్పోజింగ్ సైతం చాలా విమర్శలకు కారణం అయింది. ఈ క్రమంలోనే షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ తో పంపించిన ఆరుగురిలో మాధురి, రమ్యల విషయంలో ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆడియన్స్ సైతం ఇకపై షోను చూసే అవకాశం లేదని.. కచ్చితంగా బిగ్ బాస్ కు భారీ బొక్క తప్పదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.