షూటింగ్ టైంలో ఆ స్టార్ హీరో టార్చర్ భరించలేకపోయా.. బిగ్ బాస్ సంజనా ఎమోషనల్..

ప్రజెంట్ టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. బిగ్ బాస్ సీజన్ 9 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ షోలో హీరోయిన్ సంజనా గల్రాని సైతం కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. గతంలో తెలుగు, తమిళ్, కన్నడలో హీరోయిన్గా ఏన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో తన ఆట తీరు, మాటలతో బుల్లితెర ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే.. సంజనాకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కెరీర్‌ ప్రారంభంలో ప్రొఫెషనల్ పరంగా ఆమె ఎన్నో ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నానని.. వేధింపులను చెవి చూశానని.. ఆమె ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.

ముఖ్యంగా ఓ హీరో తనను మానసికంగా ఎంతగానో వేధించాడు అంటూ షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. కన్నడలో ఓ మూవీ షూట్ నాకు చాలా ఇబ్బంది కల్పించిందని ఓ స్టార్ హీరో.. నన్ను టార్చర్ పెట్టాడు. అది నేను అసలు భరించలేకపోయా.. డైరెక్టర్ తో అప్పటికే అతనికి గొడవలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలోనే షూట్ జరుగుతున్న టైంలో హీరో వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ సంజనా వివ‌రించింది. వాస్తవానికి ఓ సీన్‌లో హీరో నా చేతులు పట్టుకుని.. ముందుకు కదలాలి. కానీ.. ఆయన డైరెక్టర్‌పై కోపంతో వచ్చి.. నా చేతులను పట్టుకొని గట్టిగా నొక్కేసాడు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ బ్యూటీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ కేసు విషయంలో నోటీసులు జారీ!

నొప్పిగా ఉందని చెబితే.. మక‌చానేజ్ చేసుకో అంటూ సీరియస్ లుక్ ఇచ్చాడు. దీంతో నేను షూటింగ్ కు బ్రేక్ చెప్పేసా అంటూ వివరించింది. నేనేమీ దెబ్బలు తినడానికి ఇక్కడికి రాలేదు కదా.. ఇదేమి యాక్షన్ మూవీ కూడా కాదు.. నేను విలన్ అంతకన్నా కాదు.. ఈ సీన్ కు తగ్గట్టుగా నీ మైండ్ సెట్ మార్చుకుంటే.. సినిమా అప్పుడే కంటిన్యూ చేద్దామని.. చెప్పి బయటకు వచ్చేసిందట. సరిగ్గా అరగంట తర్వాత మళ్ళీ అదే సిన్ కంప్లీట్ చేసాం అంటూ.. సంజనా వివరించింది. ఇక.. ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లు కూడా తగులుతూ ఉంటారు.. వారిని పట్టించుకోకూడదు.. మన పని మనం చేసుకుంటూ పోవాలంటే సంచనా వివరించింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ తెగ వైరల్ గా మారుతుంది. అయితే.. ఇంతకీ ఆమెను వేదించిన హీరో ఎవరనే విషయాన్ని మాత్రం తాను రివీల్‌ చేయలేదు.